క ళా స్పూ ర్తి
Art By Busani Pruthviraj Varma (+919441459124)
జీవన యోగం
వైరాగ్యమను ప్రమిదలో భక్తి అనే తైలము తో, వత్తి ని ఏకాగ్రత గా జేసి ఆత్మవిచారణ అనెడి దీపాన్ని నాలో వెలిగింప జేసిన, పాపాన్ని నశింపజేసిన, జ్ఞానాన్ని ప్రసాదిస్తున్న ఆ దివ్యతేజానికి నమస్కరిస్తున్నాను.
@ ఉష
అజ్ఞాన తిమిరం అందనంత దూరాన విడిచేసా
సజ్జన సాంగత్యం అల్లంతన కనగానే చేరువైపోయా
ఉత్తమ గురుకైంకర్యం గ్రక్కున సాధించా
విముక్తి ద్వారం ఆవలి ప్రక్కకి అడుగేసేసా
ధ్యాన సహితంగా సాధన చేస్తున్నా
చక్షువు కనని ప్రాప్తాలు యోగాన కనుగున్నా
జీవనమే చమురుగా జైతయాత్ర చేస్తున్నా
పరమాత్మ ఉనికిని అందందు కనుగున్నా
జగదాధార మూర్తికి దాసోహమన్నా
విశ్వమంతా చలువనింపు వెన్నెలజ్యోతికి నాచేతనైన వెలుగుని పంచా..
.
కుల, మత, లింగ, వయో బేదము లేకుండా భవరోగం అనుభవిస్తున్న జీవరాసులకి అనేక సద్గుణములు చిగుళ్ళు గా కల్గి జన్మరాహిత్యాన్ని దు:ఖరాహిత్యాన్ని, అమూల్యమైన మోక్షాన్నిచ్చే భగవద్గీతా కల్ప వృక్షం అనే మహత్తర దివ్వ్యౌషధము ప్రసాదించిన కోట్లానుకోట్లసంవత్సరాలుగా నిలిచి వున్న అఖండమైన శక్తి ‘పరమాత్మ’ కు నమస్కరిస్తున్నాను.
నీ ప్రేమకై ...
నీ ఊహల నీడల మాటున
ఆ ఊసులు కూర్చిన స్వరమున
నా రోదన గాధను పాటగ
నీ తోడు కోరకై పాడనా
నీ జ్ఞాపకాల కలము చేసిన
గుండె గాయము మానునా
నీ తోడు కోసం మనసు పెట్టిన
ఈ రుధిర ధారలు ఆగునా !! ... నీ ఊహల
నా పాట ఈరోజు సావేరిగా సాగె
నీకోసమర్ధించు వరాళి గా మారే
నా ప్రేమ పైనీకు కినుకెందుకే దేవి
వ్యధనుండి నాకింక ముక్తెప్పుడే దేవి !! .. నీ ఊహల
.
కలలు-కన్నీళ్లు
కలగంటున్న యెదగల హితుడవు
వలదంటున్నా కదలని తపనవు
వ్యర్ధం అన్నా వదలని గోడువి
అభ్యర్ధనకూ కరగని వాడివి
హృదయం ఉన్నా పంచగ లేనని
పరిమితులేవో నాకూ గలవని
చెప్పిన మాటలు పెడచెవి పెడితివి
ఇచ్చిన అలుసును తప్పుగ చూస్తివి
ఇప్పుడు చూడు ఏమయ్యిందో
కురులే ఉరిగా బిగిసిన కంఠం
బంగరు బహుమతె నీ బలి పీఠం
నా చెక్కిలి చెప్పెగ నాకో పాఠం
ప్రేమే నాపై నిజముగ ఉంటే
చేసిన వినతులు నువ్వే వింటే
ప్రాణం నీకు మిగిలుండేది
బ్రతుకున హితుడుగ ఉండేవాడివి
నా కన్నీళ్ళు నిను తేలేవు
అదితెలిసినా ఈనీళ్ళు ఆగలేవు..
వలదంటున్నా కదలని తపనవు
వ్యర్ధం అన్నా వదలని గోడువి
అభ్యర్ధనకూ కరగని వాడివి
హృదయం ఉన్నా పంచగ లేనని
పరిమితులేవో నాకూ గలవని
చెప్పిన మాటలు పెడచెవి పెడితివి
ఇచ్చిన అలుసును తప్పుగ చూస్తివి
ఇప్పుడు చూడు ఏమయ్యిందో
కురులే ఉరిగా బిగిసిన కంఠం
బంగరు బహుమతె నీ బలి పీఠం
నా చెక్కిలి చెప్పెగ నాకో పాఠం
ప్రేమే నాపై నిజముగ ఉంటే
చేసిన వినతులు నువ్వే వింటే
ప్రాణం నీకు మిగిలుండేది
బ్రతుకున హితుడుగ ఉండేవాడివి
నా కన్నీళ్ళు నిను తేలేవు
అదితెలిసినా ఈనీళ్ళు ఆగలేవు..
ప్రియా.. నీ కోసమే ఈ నిరీక్షణ...
ప్రియా, నా కంటి నీటి వరద నిన్ను ముంచకూడదని కనులు మూసి ఒక మనవి.
కాలపు కొమ్మల్లో చివురించే క్షణాలు,
వాడి రాలిన క్షణాల్నిచూసి వెక్కిరిస్తే,
నేలవాలినవి నవ్వుకుంటాయేమో,
ఆ పచ్చదనం రెప్పపాటేనని.
ఆశల గుబురు పొదలు, వాటి చిక్కని చివురుకొమ్మలూ,
ఆ కొమ్మల వూగే చిగురుటాకుల కవ్వింపే జీవితానికి కాదా వూపిరి?
నేల చేరిన నిరాశా, నిట్టూర్పుల క్షణాల్ని తాము
చేరమంటూ సేదతీరుస్తాయి, వూరడిస్తాయి, వూరిస్తాయి.
గుండెగూటిలో చేరిన తీపిక్షణాలు కదలి వస్తున్న క్షణం,
వున్నపాటుగా తమది కావాలంటూ తపించి సంబరపెడతాయి.
ఎన్ని విధాలు ఈ చిన్ని క్షణాల గమనాలు నేస్తం?
కంటి రెప్పల కన్నీటి క్షణాలు తామూ మిగలమంటూ జారిపోతాయి.
పెదవి చాటు పద క్షణాలంతే ఇట్టే పరుగిడిపోతాయి.
ఇన్నిటా గుప్పిట పట్టినన్ని స్ఫటిక క్షణాలు దాచిపెట్టాను.
నీకు పంచి నీ ప్రేమని వాటన్నిటా బింబించాలనీ,
నా ఎదురుచూపుల నిదుర కనులకి నెమ్మది అందించాలనీను.
కాలం మరో మారు చివురించక మునుపే నా నిరీక్షణ త్రుంపగ రావా, ప్రియా?
ఉష గారు కవిత రాసి పెట్టినందుకు చాలా థాంక్స్ అండి.
`
ము ని
వేదన మంటను జ్ఞానపు జ్యోతిగమార్చి
వేదము ఇచ్చిన స్వేచ్చకు ఆకృతినిచ్చి
పంజర జీవన శైలిని స్వస్థినితెల్పి
వేదము ఇచ్చిన స్వేచ్చకు ఆకృతినిచ్చి
పంజర జీవన శైలిని స్వస్థినితెల్పి
యోగము పొందిన జీవది సత్యముతెల్ప
పంజరాన నను నిల్పినా, మనో దృష్టి ఆగునా
ప్రియా నీ జాడ తెలియగా, నిను చేర
నీ తలపుల అలలు నాలో ఉత్తుంగమై చెలరేగగా
మౌనినై నీ తపములో మునిగి
తదేకంగా నే తదాత్మ్యం చెందగ
నన్నాపలేవులే ఏ బంధనాలు
పంజరాన నను నిల్పినా, మనో దృష్టి ఆగునా
ప్రియా నీ జాడ తెలియగా, నిను చేర
నీ తలపుల అలలు నాలో ఉత్తుంగమై చెలరేగగా
మౌనినై నీ తపములో మునిగి
తదేకంగా నే తదాత్మ్యం చెందగ
నన్నాపలేవులే ఏ బంధనాలు
బ్రతుకు నావ !
చుక్కాని లేనిది నా బ్రతుకు నావ,
చుక్కానే నీవై నడుపుతున్నది నీ నావ.
నడిసంద్రాన మన పయనం, నావకే ఎరుకలేని గమ్యం.
యేడేడు లోకాలంటి ఈ యేడేడు భవసాగరాలు,
యెన్నెన్నో మన జన్మల ఎదురీత పడవల్లో,
కలవలేని మనం ఇలా కలిసే సాగుతున్నాం.
తెరచాప తెలియని తెడ్డు పడవ నాది
ఏ దిక్కు కలవని బ్రతుకు గమనము మనది
నీ చూపు చుక్కాని నమ్ముకున్నాను
అది లేని నాబ్రతుకునమ్ముకున్నాను
ఏదారి పోలేక గోదారి నడిమిట్ల
పరువాల నీదారినొదులుకున్నాను
ఏదారి కనరాక ఇక్కట్ల బ్రతుకులో
భారాన ఈ నదిని దాటుతున్నాను
చుక్కానే నీవై నడుపుతున్నది నీ నావ.
నడిసంద్రాన మన పయనం, నావకే ఎరుకలేని గమ్యం.
యేడేడు లోకాలంటి ఈ యేడేడు భవసాగరాలు,
యెన్నెన్నో మన జన్మల ఎదురీత పడవల్లో,
కలవలేని మనం ఇలా కలిసే సాగుతున్నాం.
తెరచాప తెలియని తెడ్డు పడవ నాది
ఏ దిక్కు కలవని బ్రతుకు గమనము మనది
నీ చూపు చుక్కాని నమ్ముకున్నాను
అది లేని నాబ్రతుకునమ్ముకున్నాను
ఏదారి పోలేక గోదారి నడిమిట్ల
పరువాల నీదారినొదులుకున్నాను
ఏదారి కనరాక ఇక్కట్ల బ్రతుకులో
భారాన ఈ నదిని దాటుతున్నాను
ఎర్ర మందారం
@ఆత్రేయ
ఒంటరి బ్రతుకుకి విలువేలేదని
జంటలు కట్టి చేతులు కలిపి
ఒకటై చూపి పూవుగ అమరిన
రెక్కలు చూపిన బాటను సాగు
సఖ్యతలోనే అందం ఉందని
సభ్యత కలిపిన విజయం నీదని
మందారం అది చక్కని గురువుగ
నేర్పిన బాటన ముందుకు సాగు
జంటలు కట్టి చేతులు కలిపి
ఒకటై చూపి పూవుగ అమరిన
రెక్కలు చూపిన బాటను సాగు
సఖ్యతలోనే అందం ఉందని
సభ్యత కలిపిన విజయం నీదని
మందారం అది చక్కని గురువుగ
నేర్పిన బాటన ముందుకు సాగు
పూరెకుల కలగొలుపు
పువ్వుకే అందాన్ని తెచ్చిపెట్టె
మతోన్మాదుల మారణ కాండ
దేశానికే చిచ్చుపెట్టె
ఎర్ర మందారం
ఎదకు ఎంతో ఆహ్లాదం
ఉగ్రవాదుల ఉన్మాదం
ఈ దేశానికెంతో విశాదం
పేదగుండెల బ్రతుకు మంటల ఈ అగ్ని శిఖలాలనార్పలేమా?
అడుగడుగునా కూలిపోయే నెత్తుటి చితిమంటలనార్పలేమా?
ఆధునిక మానవుని ఆటవిక అరాచకాన్ని మాన్పంచలేమా?
కలవరింతల జీవితాల్లో ఆనందమందారాలు పూయించలేమా?
(పూరెకుల ఐక్యమత్యం, సర్దుబాటు, చక్కటి క్రమశిక్షణనేర్పే వాటి అమరిక లేదా విన్యాసం వల్ల పరిమళాలు వెదజల్లే పుష్పాల్ని మనంచూస్తున్నాముకదా మరి అలాగే శాంతియుత దేశాన్ని ఐక్యమత్యంతో మనం ఎందుకు పొందలేము? పొందవచ్చని భావన అంతే..:D)
ఆత్మ సౌందర్యం ఇంకా గొప్పది.
http://pruthviart.blogspot.com/
సిగలోన కలువెట్టి మణులున్న గొలుసెట్టి
గుండెల్లో గుబులెట్టి మామీద కసిగట్టి
కుంచెమీదన కినుక మామీద చూపెట్టి
చూపుల్ని దాపెట్టె నకటా అందాలపట్టి
ఆత్రేయ గారు, మీ కళా హృదయానికి నమస్కారములు.
ఈ చిత్రానికి చక్కని కవిత నందిన్చినందులకు కృతజ్ఞుడను.
గుండెల్లో గుబులెట్టి మామీద కసిగట్టి
కుంచెమీదన కినుక మామీద చూపెట్టి
చూపుల్ని దాపెట్టె నకటా అందాలపట్టి
ఆత్రేయ గారు, మీ కళా హృదయానికి నమస్కారములు.
ఈ చిత్రానికి చక్కని కవిత నందిన్చినందులకు కృతజ్ఞుడను.
http://pruthviart.blogspot.com/
భర్త ప్రాణము తోనొక ముడి విడి
పుత్రుని శోకము లోనొక ముడి విడి
ఆఖరి ఒకముడి మెడలో దిగబడి
బరువై మిగిలెగ కంటికి ఆ తడి
ఈ చిత్రం హృదయ భాషకు చక్కని భావాన్నితన కవిత లో తెలిపిన ఆత్రేయ గారికి అభినందనములు.
భర్త ప్రాణము తోనొక ముడి విడి
పుత్రుని శోకము లోనొక ముడి విడి
ఆఖరి ఒకముడి మెడలో దిగబడి
బరువై మిగిలెగ కంటికి ఆ తడి
ఈ చిత్రం హృదయ భాషకు చక్కని భావాన్నితన కవిత లో తెలిపిన ఆత్రేయ గారికి అభినందనములు.
ఆశా కిరణము
@ రాధిక గారు,
నినుచేరాలనే ఆరాటం
అందుకే చీకటితో పోరాటం
నీ కన్నుల వెలుగులో నా పయనం
నా నీడే నా సైన్యం
అందుకే చీకటితో పోరాటం
నీ కన్నుల వెలుగులో నా పయనం
నా నీడే నా సైన్యం
@ ఆత్రేయ గారు
కన్నుల కురిసే వెన్నెల పధమున
రేపటి పున్నమి వెలుగుని కనుగొన
నీడల బ్రతుకును వెనకనె వదిలి
నీకై ముందుకు ఆశగ తరలితి
@ పృథ్వీ, స్వార్థంకొసం, ఒకరి స్నేహాం కోసం, మరొకరి ప్రేమకోసం ఈ జీవన ప్రయాణం చీకటిలో నీడలా గుర్తుతెలియకుండా గడిచిపోవద్దు.. కళలునేర్చి కళాకారుడు కూడా కావొచ్చు, కానీ కష్టసాధ్యమయ్యే పరమపవిత్రమైన ఆత్మవిచారణగావిస్తూ పునర్జన్మరహిత పవిత్రుడు, పుణ్యాత్ముడు, మహాత్ముడు మనిషి కావటానికి నిరంతర అభ్యాసప్రయత్నం జరుపుతూ బ్రతుకును ఆశగా ముందుకు సాగించాలని గీసిన ఈ బొమ్మకు కవితలు చక్కగా కుదిరినాయి. బాగున్నాయి.
అత్మియతలు/అడ్డుగోడలు
కత్తి మహేష్ గారి ‘గోడలు’ కవితకు నా స్పందన
బీటలు వారిన గుండె గదుల్లో
విధి విసిరేసిన నల్ల తెరల్లో
విడివడి పోయిన ప్రేమ జీవులవి
చితికిన ఎడదల రుధిర ధారలవి
విధి విసిరేసిన నల్ల తెరల్లో
విడివడి పోయిన ప్రేమ జీవులవి
చితికిన ఎడదల రుధిర ధారలవి
Subscribe to:
Posts (Atom)