ప్రియా, నా కంటి నీటి వరద నిన్ను ముంచకూడదని కనులు మూసి ఒక మనవి.
కాలపు కొమ్మల్లో చివురించే క్షణాలు,
వాడి రాలిన క్షణాల్నిచూసి వెక్కిరిస్తే,
నేలవాలినవి నవ్వుకుంటాయేమో,
ఆ పచ్చదనం రెప్పపాటేనని.
ఆశల గుబురు పొదలు, వాటి చిక్కని చివురుకొమ్మలూ,
ఆ కొమ్మల వూగే చిగురుటాకుల కవ్వింపే జీవితానికి కాదా వూపిరి?
నేల చేరిన నిరాశా, నిట్టూర్పుల క్షణాల్ని తాము
చేరమంటూ సేదతీరుస్తాయి, వూరడిస్తాయి, వూరిస్తాయి.
గుండెగూటిలో చేరిన తీపిక్షణాలు కదలి వస్తున్న క్షణం,
వున్నపాటుగా తమది కావాలంటూ తపించి సంబరపెడతాయి.
ఎన్ని విధాలు ఈ చిన్ని క్షణాల గమనాలు నేస్తం?
కంటి రెప్పల కన్నీటి క్షణాలు తామూ మిగలమంటూ జారిపోతాయి.
పెదవి చాటు పద క్షణాలంతే ఇట్టే పరుగిడిపోతాయి.
ఇన్నిటా గుప్పిట పట్టినన్ని స్ఫటిక క్షణాలు దాచిపెట్టాను.
నీకు పంచి నీ ప్రేమని వాటన్నిటా బింబించాలనీ,
నా ఎదురుచూపుల నిదుర కనులకి నెమ్మది అందించాలనీను.
కాలం మరో మారు చివురించక మునుపే నా నిరీక్షణ త్రుంపగ రావా, ప్రియా?
ఉష గారు కవిత రాసి పెట్టినందుకు చాలా థాంక్స్ అండి.
`
అధర సుధానురాగ మాధుర్యము మరచి,
ReplyDeleteనను వీడిన చెలికానికి
అశ్రుకడలి తర్పణమిదివో!
అద్భుత చిత్ర లేఖనము.
నీ కన్నీటి నడి సంద్రాన
ReplyDeleteజ్ఞాపకాలే తోడుగా ....
ప్రియా ....నీకోసమే ఈ నిరీక్షణ
ప్రతి అస్తమయం ఒక రోజుకు ముగింపు
ఐనా .....
ప్రతి సూర్యోదయం మరో రోజుకు ప్రారంభమేగా !
పృధ్వీ మీ కళామూర్తి స్ఫూర్తి గా వ్రాసాక ఒకింత సంశయం కలిగి ఇక్కడ పెట్టలేకపోయిన నా కవిత ఇదిగో...
ReplyDelete"నా నిరీక్షణ త్రుంపగ రావా, ప్రియా?"
http://maruvam.blogspot.com/2009/01/blog-post_28.html
మీకు అభ్యంతరం లేకపోతే ఇక్కడ కూడా పెడదాం. ఎందుకో నా భావాలు మీ భావనకి సరి తూగవేమో ననిపించింది క్రొత్తగా ఈవేళ.
మీ స్తృజనాత్మకత బాగుంది
ReplyDeleteWith approval from పృధ్వీ:
ReplyDeleteప్రియా, నా కంటి నీటి వరద నిన్ను ముంచకూడదని కనులు మూసి ఒక మనవి.
కాలపు కొమ్మల్లో చివురించే క్షణాలు,
వాడి రాలిన క్షణాల్నిచూసి వెక్కిరిస్తే,
నేలవాలినవి నవ్వుకుంటాయేమో,
ఆ పచ్చదనం రెప్పపాటేనని.
ఆశల గుబురు పొదలు, వాటి చిక్కని చివురుకొమ్మలూ,
ఆ కొమ్మల వూగే చిగురుటాకుల కవ్వింపే జీవితానికి కాదా వూపిరి?
నేల చేరిన నిరాశా, నిట్టూర్పుల క్షణాల్ని తాము
చేరమంటూ సేదతీరుస్తాయి, వూరడిస్తాయి, వూరిస్తాయి.
గుండెగూటిలో చేరిన తీపిక్షణాలు కదలి వస్తున్న క్షణం,
వున్నపాటుగా తమది కావాలంటూ తపించి సంబరపెడతాయి.
ఎన్ని విధాలు ఈ చిన్ని క్షణాల గమనాలు నేస్తం?
కంటి రెప్పల కన్నీటి క్షణాలు తామూ మిగలమంటూ జారిపోతాయి.
పెదవి చాటు పద క్షణాలంతే ఇట్టే పరుగిడిపోతాయి.
ఇన్నిటా గుప్పిట పట్టినన్ని స్ఫటిక క్షణాలు దాచిపెట్టాను.
నీకు పంచి నీ ప్రేమని వాటన్నిటా బింబించాలనీ,
నా ఎదురుచూపుల నిదుర కనులకి నెమ్మది అందించాలనీను.
కాలం మరో మారు చివురించక మునుపే నా నిరీక్షణ త్రుంపగ రావా, ప్రియా?
అందరికీ నమస్కారములు. చాలా బావున్నాయి స్పందనలు. థాంక్స్...
ReplyDeleteఉషాగారి కవిత ఇంకనూ నచ్చేసింది. మేడమ్, నాకు ఎలాంటి అభ్యంతరం ఎప్పుడూ వుండదు. నేనే కొంచెం రూటుమార్చిచూసాను. ఏదేమైనా మన కళాకృతులు ఇలాగే కొనసాగాలని ఆకాంక్షిస్తున్నాను..
చెలియ చింతన చెక్కిళ్ళు కడిగె
ReplyDeleteమనిషి చింతన కన్నీళ్ళ మునిగె
మనసున మొలిచెను పచ్చని ఆశలు
గతమును విడమనె వెచ్చని బింబము
విధి పరిచిన వల ఈ గతము
గడచిన ఘడియలు వేసిన ముడులవి
రమ్మని పిలిచెడి ప్రేమొక ఎర
పదునగు కత్తిని దాచిన ఒర
అందని ప్రేమకు బ్రతుకుని చంపకు
అందిన ప్రేమను బ్రతుకని చెప్పకు
బ్రతుకున ప్రేమొక భాగము ఎరుగుము
గతమొక బాధల బ్రమయని తెగడుము
చెమరిన కన్నులు తుడిచే సమయం
బ్రతుకును ముందుకు నడిపే తరుణం
గగనపుటంచులు తాకే సమయం
అదిగో చూపెను కనబడు ఉదయం
పృధ్వీగారూ...... మీ కుంచెల కళాస్పూర్తులకు నా జోహార్లు.
ReplyDelete