click the image to get enlarge
స్త్రీ జన్మ నిచ్చి కష్టాల కొలిమిలో పడవేసినా .....
నీ ముంగిట దివ్వెనై నన్ను వెలిగించుకుంటా ....
నీకూ వెలుగునిస్తా .........ప్రభూ !
కంటి చమురు ఇంధనంగ
గుండె మంటే తన ధనంగ
దిగులు గాలి చేత చిక్కి
ఊత మిచ్చే తోడు కోసం
బ్రతుకు కోవెల మెట్లు జారి
వెలగ గోరెన ఆ నారి ఎవరు ?
.
తెలుసుకో నేస్తం
ReplyDeleteకన్నీరు కష్టాలకి తైలమై నిను మరింత మండిస్తుంది
చాలాబాగుంది ”దీపంజ్యోతిపరంబ్రహ్మ” ఆ పరబ్రహ్మస్వరూపమైన స్త్రీమూర్తి తన సంసారవృద్ధికోసం తనకష్టాలకన్నీళ్ళను దిగమ్రింగుతూ కుటుంబానికి వెలుగునిస్తునేవుంటుంది.
ReplyDeleteఏలనే బాలా ఏ బేల తనము
ReplyDeleteకలలు కల్లలైనందుకా
తల్లడిల్లే మనసు కుదుట
కుదుటపడునే లలనా
కూసింత తలచిన విభుని
సేదదీర్చే ప్రభుని (భగవంతుని)
దివ్వెగ మార్గము చూపగ
రవ్వంత కరుణ లేదని వగచకు
చిరు దివ్వెవు నీవే
కోటి దివ్వెల వెలిగింతువు కదా
ఆరీపోయే జీవితాలను సైతం వెలిగించే శక్తి ఆ కన్నీటికి ఉంది.ఆ శక్తిని భగవంతుడే ప్రసాదించాడు స్త్రీకి.కళ్ళల్లో జీవం ఉట్టిపడుతుంది.
ReplyDeleteఇదేంటి అచ్చంగా నాలావుందీ చిత్రం?
ReplyDeleteఅష్టనాయికలన్నీ పోల్చిచూసినా చెప్పలేం ఎవరిదనీ చిత్రం!
వాసవసజ్జికవోలె అందంగా అలంకరించుకొని, విరహోత్కంఠితై కనుల నీరిడి,
అభిసారికై వెన్నెల్లో వేచి, అంతలోనే తన బలిమి తెలిసి,
బలహీనమై గుండెలోనో, గుడిప్రాంగణంలోనో, వేయిమొక్కులు నీకై మొక్కుతూ,
అవును అచ్చంగా ఈ ఇంతి నాలానేవుంది, కానీ నాకంత అందమే లేదు...
స్త్రీ జన్మ నిచ్చి కష్టాల కొలిమిలో పడవేసినా .....
ReplyDeleteనీ ముంగిట దివ్వెనై నన్ను వెలిగించుకుంటా ....
నీకూ వెలుగునిస్తా .........ప్రభూ !
కంటి చమురు ఇంధనంగ
ReplyDeleteగుండె మంటే తన ధనంగ
దిగులు గాలి చేత చిక్కి
ఊత మిచ్చే తోడు కోసం
బ్రతుకు కోవెల మెట్లు జారి
వెలగ గోరెన ఆ నారి ఎవరు ?
really fantastic !
ReplyDelete