వైరాగ్యమను ప్రమిదలో భక్తి అనే తైలము తో, వత్తి ని ఏకాగ్రత గా జేసి ఆత్మవిచారణ అనెడి దీపాన్ని నాలో వెలిగింప జేసిన, పాపాన్ని నశింపజేసిన, జ్ఞానాన్ని ప్రసాదిస్తున్న ఆ దివ్యతేజానికి నమస్కరిస్తున్నాను.
@ ఉష
అజ్ఞాన తిమిరం అందనంత దూరాన విడిచేసా
సజ్జన సాంగత్యం అల్లంతన కనగానే చేరువైపోయా
ఉత్తమ గురుకైంకర్యం గ్రక్కున సాధించా
విముక్తి ద్వారం ఆవలి ప్రక్కకి అడుగేసేసా
ధ్యాన సహితంగా సాధన చేస్తున్నా
చక్షువు కనని ప్రాప్తాలు యోగాన కనుగున్నా
జీవనమే చమురుగా జైతయాత్ర చేస్తున్నా
పరమాత్మ ఉనికిని అందందు కనుగున్నా
జగదాధార మూర్తికి దాసోహమన్నా
విశ్వమంతా చలువనింపు వెన్నెలజ్యోతికి నాచేతనైన వెలుగుని పంచా..
.
అజ్ఞాన తిమిరం అందనంత దూరాన విడిచేసా
ReplyDeleteసజ్జన సాంగత్యం అల్లంతన కనగానే చేరువైపోయా
ఉత్తమ గురుకైంకర్యం గ్రక్కున సాధించా
విముక్తి ద్వారం ఆవలి ప్రక్కకి అడుగేసేసా
ధ్యాన సహితంగా సాధన చేస్తున్నా
చక్షువు కనని ప్రాప్తాలు యోగాన కనుగున్నా
జీవనమే చమురుగా జైతయాత్ర చేస్తున్నా
పరమాత్మ ఉనికిని అందందు కనుగున్నా
జగదాధార మూర్తికి దాసోహమన్నా
విశ్వమంతా చలువనింపు వెన్నెలజ్యోతికి నాచేతనైన వెలుగుని పంచా
పృధ్వీ, ఉదయానే ఈ చిత్రం కనులకు విందుగా వుంది. మీ భావన నాకు తెలియదు. కానీ సాధనతో మానవుడు సాధించగలవీ స్థితులని తోచి వ్రాసానిలా. నిరభ్యంతరంగా తొలగించవచ్చు మీరీ వ్యాఖ్యను.
పృథ్వీ, బహుశా నా మనసులో ఈ కవిత స్తుతి భావనలు నడయాడినపుడే మీ చిత్రం కూడా ప్రాణం పోసుకునివుండొచ్చుననిపించింది.
ReplyDeleteజగదాధారా! జరామరణ జీవితం చాలదనా, ఇంకా లీలచూపుతున్నావు?
http://maruvam.blogspot.com/2009/04/blog-post_06.html
మరి మీరేమంటారు?
మరువం ఉష గార్కి నమస్తె. చక్కని కామెంటుకు ధన్యవాదాలు.
ReplyDeleteఅలా అని కాదు మీ కవితా భావాలు ఫోస్టుల్లో అర్ధం చేసుకున్నాను. ఎవరి ఆధ్యాత్మకతాదృక్పదమ్ వారిది. ప్రాణం పోయాల్సిన చిత్రాలు ఎన్నెన్నో వున్నాయి మనసునిండా. కాని నాలోని చింతనతో చిత్రాలను చేరదీయలెక పోతున్నా..ఏదో వున్నానని గుర్తుగా ఒకటో రెండో చూపిస్తున్న. వాటి ఆలోచనలు చెప్పాలంటే సమయంసరిపోదు.
జీవనదిలా మీ చక్కని కవితాభావాలు భ్లాగులో ఇంకా కొనసాగాలని ఆంక్షిస్తూ...
మీ పృథ్వీ
అద్భుతం
ReplyDeleteత్రినేత్రమే తిలకము
ReplyDeleteక౦ఠమే గరళభా౦డము
శిరస్సున చ౦ద్రుడు నిక్షేపము
పులితోలుపై పద్మాశనము
తనువ౦తా ధ్యానరూపము
మీ ఈ చిత్రలేఖన౦ ఈశ్వరుని మరో అవతారము.
పృధ్విగారూ, ఉషగారు ఇచ్చిన పరిచయమే మీదాకా వచ్చిన నా ప్రయాణానికి వాహనము.
ఈ కవిత మీ కు౦చెలోని మనసుకు నాకు తోచిన ఓ చిన్న అభిప్రాయము.
మీలోని చిత్రకారుడు మీ కీర్తికి కాగలడు స్వర్ణాభరణము.
నా పేరు ఆన౦ద్. నమస్కారము.
నాగన్న గారు, ఆనంద్ గారు బ్లాగు కు సుస్వాగతము.
ReplyDeleteఆనంద్ గారు సింపుల్ గా వ్యక్తీకరించారు అయినా బావుంది. కళాకారుల కామెంట్స్ చూస్తుంటే సత్యం శివం సుందరం గుర్తుకు వస్తున్నది. నాకు తెలిసి ఈ దుఖా:లయము లో చూసే చూపులోనే వున్నది అంతా అన్న భావం కలుగుతున్నది. బ్లాగు లో బొమ్మల ప్లాట్ ఫామ్ చిన్నది కావటం వల్ల తగిన శ్రద్ద చూపలేకపోయాను.
at last Thanks for all..
మీ అద్భుతమైన చిత్రానికి ఉష గారి కవిత మరింత సొబగులద్దింది.అభినందనీయులిరువురు.
ReplyDeleteబాగుంది. సామాన్యంగా మీరు చూపించే శైలికి భిన్నంగా ఉంది
ReplyDeletevery very beautiful
ReplyDeleteమీ పేయింటింగ్ ఆలోచన రేకెత్తించేదిగా ఉంది. చక్కటి సృజన చేసినందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాను.
ReplyDeleteఈగ హనుమాన్ nanolu.blogspot.com
మీ చిత్రం చాలా బాగుంది.
ReplyDelete