11 comments:

  1. కలిసి ఉందామని ఇద్దరు
    వలదని మరొకరు
    కొట్టుకుంటున్న నీ తనయులను
    చూడలేక కళ్ళు మూసుకున్నావా తల్లీ!

    బహుకాల దర్శనం.

    ReplyDelete
  2. చాలా కాలం తర్వాత మరో అర్ధవంతమైన చిత్రంతో కొత్త సంవత్సరానికి శ్రీకారం చుట్టారు !నూతన సంవత్సర శుభాకాంక్షలు !

    ReplyDelete
  3. Excellent one!

    For more details regarding attack on Star Comedian Brahmanandam log on to the following link:
    http://blogubevars.blogspot.com/2010/01/4.html

    ReplyDelete
  4. పృథ్వి, ధన్యురాలను. మీ చిత్రకళాభిమానిగా మళ్ళీ మీ చిత్రపునర్దర్శనం నా భాగ్యం. స్తంభించిన మీ కుంచెలో కదలిక, స్తబ్దతలో మునిగిన మీ మనసులో సవ్వడి. ఇక ఈ చలనాన్ని కానీ స్పందనని కానీ ఆపకండి. "కల్లోల సాగరాన మునిగిన ఆత్మని కనులు మూసి వెదుక్కునట్లు, ఎదుటే నిలిచిన ఆత్మకి మూసిన కనుల వెనుక మనసులోనున్నదేదో దాస్తున్నట్లు... " మీ భాష్యాలు నేను చెప్పానా?

    ReplyDelete
  5. చూడగానే ఎన్నో భావాలు స్ఫురించేట్లుంది.
    మీకు నూతన సం.ర శుభాకాంక్షలు.

    ReplyDelete
  6. కనులు మూసి, కన్నీటి
    సాగరాన నను ఉంచి,
    నీవు తరలిపోతున్నావా,
    ఇక కనుమరుగైపోతున్నవా...!

    నమస్తే పృథ్వి గారు,
    మీకు నుతన సంవత్సర శుభాకాంక్షలు.

    ReplyDelete
  7. చిత్రాకళాభిమానులకు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు.
    నన్ను గుర్తించి మెచ్చి అభిప్రాయాలను ఇంకనూ తెలియపరుస్తున్న బ్లాగు మిత్రులకు మరొకసారి ధన్యవాదములు. ఇంకనూ మీ ఆలోచనా లోతులను కవితల్లో కామెంట్లలో చూడాలని ఆశిస్తుసూ...
    మీ
    పృథ్వీ
    www.pruthviart.blogspot.com

    ReplyDelete
  8. స్వర్గానికి నిచ్చెనలు వేస్తున్నారా?

    ReplyDelete
  9. మరచిన బాటలు తడిమి వెదికి
    కడిగిన మనసును చేత బట్టి
    చెదిరిన బాసల పొదివి జేర్చి
    వెను తిరిగె ప్రేమ జోడు చూడ.

    మెడవంచి విధి వేసిన ముడులజాడ,
    నడినెత్తిన పూసిన ఎరుపు తోడు నీడ,
    ఓడి సుడులు తిరిగెడి గతపు జాడ
    అరచేతి మేలిముసుగు వెనక దాగుకున్నా..

    మనసు కంటిని ఎవరు మూయగలరు ?
    మాయ గుండెను ఎవరు మార్చగలరు?
    వాటి బాధను ఎవరు తీర్చగలరు ?

    ReplyDelete
  10. పృథ్వీ, ఏమైపోయారు? మునుపటి మాటే "కల్లోల సాగరాన మునిగిన ఆత్మని కనులు మూసి వెదుక్కునట్లు, ఎదుటే నిలిచిన ఆత్మకి మూసిన కనుల వెనుక మనసులోనున్నదేదో దాస్తున్నట్లు..."

    మీరు కుంచె కదపాలి. చిత్రానికో చిత్రమైన అనుభూతిని మీ అభిమానులకి పంచాలి. వీలైతే ఒకసారి నాకు ఈమెయిల్ పంపండి. ఒకవిధమైన నిరాసక్తతలో ఉన్న క్షణాన అన్ని ఐడీలు తీసేశా. అందుకనే ఉన్న ఈ ఒక్క దారిలో మిమ్మల్ని పలుకరించాల్సివచ్చింది.

    ReplyDelete
  11. Raatri Gadichindani Teliyalante Pagalu Avvali,
    Pagalu Gadichindani Telialante Malli Ratri Avvali,,
    Kani Naku Roju Gadichindani Telialante aa roju nee Darshanam Avvali !!!!

    ReplyDelete