నీ ప్రేమకై ...


నీ ఊహల నీడల
మాటున
ఆ ఊసులు కూర్చిన స్వరమున
నా రోదన గాధను పాటగ
నీ తోడు కోరకై పాడనా

నీ జ్ఞాపకాల కలము చేసిన
గుండె గాయము మానునా
నీ తోడు కోసం మనసు పెట్టిన
ఈ రుధిర ధారలు ఆగునా !! ... నీ ఊహల

నా పాట ఈరోజు సావేరిగా సాగె
నీకోసమర్ధించు వరాళి గా మారే
నా ప్రేమ పైనీకు కినుకెందుకే దేవి
వ్యధనుండి నాకింక ముక్తెప్పుడే దేవి !! .. నీ ఊహల

.

4 comments:

  1. చాలా బాగుంది వర్మగారు. నా స్పందన నా బ్లాగులో చూడగలరు.

    http://aatreya-kavitalu.blogspot.com/2009/02/blog-post_03.html

    ReplyDelete
  2. స్పందన బాగుంది. నేనూ ఇక్కడ చూపుతున్నాను. ధన్యవాదములు అండీ.

    ReplyDelete
  3. వర్మగారికి,వారి కుంచె నుండి జారె రూపాలకి స్పందించే కవితా హ్రుదయమున్న ఆత్రేయగారికి జోహార్లు....

    ఆత్రేయగారి కవితకి వ్యాఖ్య పెడదామంటె వారి బ్లాగ్ లో ఎందుకో box ఓపెన్ కావడం లేదు.
    ఆత్రేయగారు..ఏమని వర్ణించను మీ కవితా పటిమను!!

    ReplyDelete
  4. ఏరై పారినది నీ రుధిర ధార
    అయినా అది నా కంటి నుండే కదా సఖా!
    ఇది నీవు గుర్తిసే,
    మన మధ్య ఎంత దూరమున్నా చేరువ కావడం క్షణకాలం!

    ReplyDelete