మాతృమూర్తి

click the image to get enlarge

8 comments:

 1. అమ్మ చెట్టు కొమ్మ పువ్వువు నువ్వు
  ఆమె ఆశ పడ్డ రత్నాల మూటవు నువ్వు

  బ్రతుకు వేడికి అడ్డము నిల్చి
  చల్లని మమత చాయల నిచ్చి
  నీ బుడిబుడి అడుగుల ఊహలె
  తన రతనాల మూటలను ... అమ్మది..

  ReplyDelete
 2. మీ కవితాస్పందనకు ధన్యవాదాలండీ ఆత్రేయగారు.

  ReplyDelete
 3. వాహ్.....అద్భుతం!!!!

  ReplyDelete
 4. మాను నుంచి పుట్టిన
  చిన్న మొలకవు నీవు
  ఆమె జన్మ పండించిన
  రత్నాల మూట నీవు
  అంధకారం లోంచి మొదలైంది
  నీ బ్రతుకు పయనం .....
  వెలుగు వైపు నడిపించేది
  మాతృ హృదయం ..........

  ReplyDelete
 5. ఆ తరువు వేరు మొలకలం.
  ఆ మమత చేతి మణులం.
  ఆ కరుణ కంటి కలలం.
  ఆ మనిషి ప్రాణ వాయువులం.

  నిజమే అమ్మను మించిన మరే వస్తువూ లేదు కవిత కైనా, చిత్రలేఖనానికైనా.

  సమయాభావం ఇపుడు అందరినొదిలి నాఒక్కదాని దరికి చేరినట్లుంది :( చాలా వెనుకబడిపోతున్నాను, చదవటం, వ్రాయటం రెండిటా. దైనందిన జీవితం కొండచిలువలా నాలోని మనిషిని మింగేస్తుంది.

  ఒకసారి వీలునిబట్టి అమ్మ భావనలను వ్యక్తీకరించిన నా టపా "దశావతారాలు నీవేనైనావే? ఇదేం లీల?"
  http://maruvam.blogspot.com/2009/01/blog-post_31.html చదివి మీ అభిప్రాయం తెలుపండి.

  ReplyDelete
 6. పేరుపేరున అందరికీ నమస్సులు. అమ్మ అనురాగాల్ని పలికించారు. చాలా బావున్నాయి.
  ఉషగారు, కామెంట్ గా చిన్నగా వివరించి అప్రమాణికుడను కాలేను. క్రితమే చదివాను, చాలా అర్థవంతంగా వుంది కవిత. మానసికవ్యాపారములు నాకునూ బాగుగాలేని పక్షమున ప్రయత్నించడం మానేయవల్సివస్తుంది.
  బ్లాగు దర్శనానికి మరొక్కమారు ధన్యవాదాలు..

  ReplyDelete
 7. చాలా బాగున్నాయి మీరు వేసే బొమ్మలు. ఇకనుండి నేనూ మీ అనుచరుడినే. :-)

  ReplyDelete
 8. ఆత్రేయగారు అనుసరిస్తున్న బ్లాగుల జాబితాలో మీ బ్లాగు చూసి వచ్చాను. మొత్తం చిత్రాలన్ని చూసాను. మీ సృజనాత్మకతకు జోహా్ర్లు. నాదో చిన్న కోరిక. మీరు యోగం, ప్రేమలపై, సినిమావాళ్ళపై వేస్తున్నారు. అలాగే సామాజిక అంశాలపై కూడా వేస్తే చూడాలని వుంది.

  ReplyDelete