గీసిన చిత్రానికి కవితలు వ్రాసారు..

తోడు లేని సహన శీలి ధరిత్రి (పృథ్వీ) తో నింగి ప్రేమ గా తన స్నేహహస్తములతో కరచాలనము చేయు దృశ్యము.
బొల్లోజు బాబా స్పందించి వ్రాసినది.
ఒక సన్నని గీత
మనో కాన్వాసుపై విస్తరించి
ఆకైంది, కొమ్మైంది, చెట్టైంది,
కొండమలుపు వద్ద నదీ నడుం వంపైంది.
ఒక వర్ణ బిందువు
మది తెరపై వలికి తూలికైంది, పక్షయింది, పక్షి గూడైంది,
తల్లి హృదయమై ఆకలి తీర్చుతుంది,
చిత్రకారుడిది , కవిదీ కూడా!


జాహ్నవి గారు నేను గీసిన చిత్రానికి అందంగా కవిత అల్లారు.
ప్రకృతే పడతి పడతే ప్రకృతి
అనంతమైన ప్రకృతి అందాన్ని
తనలో దాచుకున్నదే రమణి
నిర్వికారమైన గగనమే ఆకారమై
సూర్యుడే సింధూరమై
లొల్లాయి పిట్టలే నేత్రాలై
ఎర్రని మందారాలే పెదవులై
వెలసిన వనితామణి అందాన్ని
కాదనగలగడం ఎవరితరమని?
దీపు గారు, మీరు చెప్పినట్టు, నిరీక్షణలో ఆవేదన చెందే ప్రియుడి పలకరింపుల కవితాపల్లకి నా మదిని దోచింది. మీకు అబినందనలు.
చిరుగాలల్లే వస్తావు
స్నేహ మాధుర్యాన్ని రుచి చూపిస్తావు
పెనుగాలై పోతావు
నాలో అలజడినే రేకిత్తిస్తావు
వానల్లే వస్తావు
మోడైన నాలో చిగురాశలొలికిస్తావు
ఉప్పెనై పోతావు
నాలో వరదై పోటెక్కిస్తావు
వెలుగల్లే వస్తావు
నాలో రంగుల్నే నింపుతావు
పగలల్లే వస్తావు
నీ వైపు నడిపిస్తావు
ఇంతలో... చీకట్లో వదిలేస్తావు!
కవ్వించే నా చెలీ!
నా సహనానికి ఈ చెట్టు, ఆ పిట్ట, ఈ గట్టు, ఆ గోదారే సాక్ష్యం!
నేను నిన్ను కలిసేనా?!

11 comments:

  1. Nice pic. I like the color scheme.
    Is it digital art? What program do you use?

    ReplyDelete
  2. photoshop 7, thank u. but i expected many comments describing thoughts through poetry about it. sare kaanivvandi.

    ReplyDelete
  3. పృధ్వీరాజ్ గారికి,

    కవిత వ్రాయమన్నారు. మీ చిత్రాం చాలా బాగుంది. నాకు కలిగిన భావనలు ఇవీ. మీకు అభ్యంతరం లేక పోతే మీ పేరుతోనే మీ చిత్రాన్ని, నాకవితను నాబ్లాగులో పెట్టుకుంటాను.

    బొల్లోజు బాబా
    http://sahitheeyanam.blogspot.com/


    ఒక సన్నని గీత
    మనో కాన్వాసుపై విస్తరించి
    ఆకైంది, కొమ్మైంది, చెట్టైంది,
    కొండమలుపు వద్ద నదీ నడుము వంపైంది.
    ఒక వర్ణ బిందువు
    మది తెరపై వలికి
    తూలికైంది, పక్షయింది, పక్షి గూడైంది,
    తల్లి హృదయమై ఆకలి తీర్చుతుంది,
    చిత్రకారుడికీ కవికీ కూడా!

    ReplyDelete
  4. ఒక సన్నని గీత
    మనో కాన్వాసుపై విస్తరించి
    ఆకైంది, కొమ్మైంది, చెట్టైంది,
    కొండమలుపు వద్ద నదీ నడుము వంపైంది.
    ఒక వర్ణ బిందువు
    మది తెరపై వలికి
    తూలికైంది, పక్షయింది, పక్షి గూడైంది,
    తల్లి హృదయమై ఆకలి తీర్చుతుంది,
    చిత్రకారుడిది , కవిదీ కూడా!

    బొల్లోజు బాబా
    http://sahitheeyanam.blogspot.com/

    ReplyDelete
  5. bolloju గారు మీ అభిమానానికి చాలా సంతోషం. మీరు తప్పకుండా కవిత రాయొచ్చు.పెట్టుకొవచ్చు. నాకు అభ్యంతరం లేదు. i am happy. కవిత కూడా బాగానేవుంది.కాని నాఆలోచనకు కాస్త దూరంగా వుంది. అయినా నా దృష్టిలోఆ బొమ్మ చెప్పే బావం ఇంకావుంది. నాబావనకు దగ్గరగా వుంటె నా blog లో పెట్టుకుందామని, artist గా కవులకు పనిచెప్పాఅంతే.

    ReplyDelete
  6. బుసాని పృధ్వీరాజు వర్మ గారు నమస్కారం.
    మీ చిత్రం చాలా బాగుంది. మీరన్నట్లు మీ చిత్రంలో నాకు చెట్లు,గట్టు,పక్షి మాత్రమే కాదు. అందమైన స్త్రీ మోము,నుదుటన సింధూరం,రెండు హస్తాల కరచాలనం, చుట్టూ చెట్లు కూడా కనిపిస్తున్నవి. కాని నాకు సాహిత్యంపై అంత పట్టు లేదు. అందమైన కవితను ఆశువుగా చెప్పలేను. కాని మీ చిత్రాన్ని చూశాక నా కలానికి నేను పని చెప్పాను. ఆ ప్రతిఫలాన్ని మరో comment లో తెలియపరుస్తాను.

    ReplyDelete
  7. బుసాని పృధ్వీరాజు వర్మ గారు నమస్కారం.
    నేను వ్రాసింది కవిత అని అంటారో అనరో కూడా నాకు తెలియదు. కాని మీరు వేసిన చిత్రం చూసిన తర్వాత నాలో కలిగిన భావాలను ఈ విధంగా వ్రాసుకున్నాను. ఈ భావాలు మీ చిత్రానికి తలవంపులు తెచ్చేవిగా ఉండవని భావించి వ్రాస్తున్నాను.

    నేను వ్రాసిన రాతలు:

    ప్రకృతే పడతి పడతే ప్రకృతి
    అనంతమైన ప్రకృతి అందాన్ని
    తనలో దాచుకున్నదే రమణి

    నిర్వికారమైన గగనమే ఆకారమై
    సూర్యుడే సింధూరమై
    లొల్లాయి పిట్టలే నేత్రాలై
    ఎర్రని మందారాలే పెదవులై
    వెలసిన వనితామణి అందాన్ని
    కాదనగలగడం ఎవరితరమని?


    మీ అనుమతిని ఇస్తే మీరు వేసిన చిత్రపటాన్ని, నా కవితను నా బ్లాగులో నేను పెట్టుకుంటాను.

    ధన్యవాదములు.

    -జాహ్నవి

    ReplyDelete
  8. ఆన్ లైన్ కవిమిత్రులారా,
    బుసాని పృధ్వీరాజు వర్మ గారు మనమెదడులకు మంచి మేత పెడుతున్నారు. రండి. స్పందించండి. తాడొ పేడొ తేల్చుకుండాం (సరదాగానే)

    బొల్లోజు బాబా
    http://sahitheeyanam.blogspot.com/

    నాబ్లాగు దర్శించినందుకు ధన్యవాదాలు. కామెంటు చేసినందుకు సుమాంజలులు.

    ReplyDelete
  9. చిరుగాలల్లే వస్తావు
    స్నేహ మాధుర్యాన్ని రుచి చూపిస్తావు
    పెనుగాలై పోతావు
    నాలో అలజడినే రేకిత్తిస్తావు

    వానల్లే వస్తావు
    మోడైన నాలో చిగురాశలొలికిస్తావు
    ఉప్పెనై పోతావు
    నాలో వరదై పోటెక్కిస్తావు

    వెలుగల్లే వస్తావు
    నాలో రంగుల్నే నింపుతావు
    పగలల్లే వస్తావు
    నీ వైపు నడిపిస్తావు

    ఇంతలో... చీకట్లో వదిలేస్తావు!`

    కవ్వించే నా చెలీ! నా సహనానికి
    ఈ చెట్టు,ఆ పిట్ట,ఈ గట్టు,ఆ గోదారే సాక్ష్యం!

    నేను నిన్ను కలిసేనా?!


    P.S: ఆ పృధ్వికి చెలి ఆ నింగి.. ఈ పృధ్వికి చెలి ఎవరో?!! :-)

    ReplyDelete
  10. @ పృధ్వి గారు

    మీకు నచ్చినందుకు సంతోషం... త్వరలో నా బ్లాగులో కూడా ఇది పెడతాను మీ అనుమతితో...

    ReplyDelete
  11. ఇలా మీ చక్కని కవితల ద్వారా బొమ్మను పలకరిస్తూవుంటుంటే వసంతలో కోయిలమ్మ తన రాగంతో ప్రకృతిని పలకరించినట్టువుంది. నాకు ఓదార్పు కలిగించినందుకు వ్యక్తిగతంగా మీ అందరికీ కృతజ్ఞతలు. నా అనుమతి ఎల్లప్పుడు వుంటుంది.నా బోమ్మల వల్ల ఒక కవితోదయం కలిగితే చాలా సంతోషిస్తాను. ప్రేరణకు నేను ముగ్దుడను. నా కవిత కన్నా చిత్రాలే బావుంటాయి కనుక మీ అందమైన కవితలను వర్ణించేవాడిని కానేమో.

    ReplyDelete