నా కన్నెమనసులో ఊహలనే రంగులతో నిన్ను నింపుకొని
నా ఊపిరిని కుంచెగా మలిచి గీయగా వచ్చిన అలరించే బొమ్మవు నీవు.
నీ జ్ఞపకాల్లో బందీవైన ప్రియమైన ఖైదీని నేను.
అక్షరమై ప్రేమ భాషలన్నీ చదివించావు.
నా ఆలోచనల్లో హల్లువై జీవితానికి అర్థం ఇచ్చావు.
నీకు దూరమైన ఈ వేళ తెలియని దిగులు నిను పలకరించాలని చెబుతున్నది.
సముద్రంలో నిశబ్దంకెరటంలా కనిపడకుండావున్నావేమి.
కాలం మోయలేని గాయం తో నా కన్నెమనసు భారంగా హృదయవిదారకంగా విలపిస్తున్నది.
ఏమి చెప్పి నన్ను నేను ఓదార్చుకోను.
నా మదిగొడల్లో నీ జ్ఞాపకాల నీడలు కంపిస్తున్నవి.
పరిమళంలేని పుష్పంవుంటుందేమో! ఈ బంగారుమేని కి నీవు లేని జీవితం ఎలా?
నా హృదయసాగరతీరంలో ప్రేమ అనే ఇసుక ఎంతవుందని చెప్పను!
నడిరేయిలో స్వప్నంలా, వసంతంలో కోయిలలా, గ్రీష్మంలో ఉషాకిరణంలా
ఇలా ఎప్పుడో నువ్వెదురు కాకుండా సముద్రంలో అలల్ల్లా ఎప్పటికీ నీ ఆశల చిరుగాలి నా మనోతీరాన్ని చేరనివ్వు.
బరువ్వెక్కిన నా గుండెల్ల్లో నీ జ్ఞపకాలు కరుగనివ్వు.
ఉరుముల్లో మెరుపుల్లా నీ కనులు నన్ను శాసించకుండా నీ పెదాల చిరునవ్వు నన్ను పలకరించనివ్వు.
నీ ఎదసవ్వడి నా హ్రదయాంతరంగాలను తాకనివ్వు.
మరువలేని ఆత్మీయస్పర్శను అందివ్వు.
నీ హృదయకాగితాన్ని ఈ ప్రేమపేజీ కొంతయినా తడిపివేయగలదన్న ఆశతో..
No comments:
Post a Comment