ఊహల్లో నా చిత్రం17 comments:

 1. నా మోములో అందం కనిపించిన వాళ్ళకి
  నా కళ్ళ అలసటా, కాళ్ళ బడలికా తెలిసేనా?
  కుండ పట్టిన నా నాజూకు చేతులు చూసిన వాళ్ళకి
  నేను నీళ్ళకోసం నడిచిన మైళ్ళ దూరం తెలిసేనా?
  జారుతున్న పైటందాన్ని అభిమానించే వాళ్ళకి
  గుండెచాటున గుంభనంగా దాచిన గుబులు తెలిసేనా?

  (28% of Indian population still doesn't have access to safe drinking water.

  40% rural women in India still need to walk on an average 5 Km to fetch Drinking Water)

  ReplyDelete
 2. హలో పృథ్వీ శుభోదయం.


  కన్నె అందాలన్నీ కడవలో దాచా
  కనురెప్పల్లో స్నేహాన్ని దాచా
  పల్లెసీమ కే ఆనందాన్నిచ్చా
  అలుపే తెలియని ఆనందం
  మా పల్లె వాసులది
  ఆప్యాయతకి మారు పేరు
  మా కన్నెల మనసులు
  అన్నట్టు అనిపిస్తుంది నాకు
  మరి "బాబా" అండ్ "మహేష్" గార్ల కు ఏమనిపిస్తుందో
  చూడాలి .[:)]

  ReplyDelete
 3. ' బావుంది ' అనడం చాలా చాలా చిన్నపదం.

  ReplyDelete
 4. నిజం గా చాలా బాగుందండి సూపర్

  ReplyDelete
 5. WOW SU...............................................................................................................................

  ReplyDelete
 6. రవి వర్మ తర్వాత ఇంకో 'వర్మ'

  ReplyDelete
 7. హలో పృథ్వీ శుభోదయం

  కన్నెపిల్ల లోని అందాలను
  కడవలో దాచినట్టు
  కన్నుల్లో స్నేహం కనిపిస్తుంటే
  మనసులో భావం మదిని దోచినట్టు
  పల్లెపడుచుని నేనే అంటూ
  రాయంచలా కడలి వొస్తున్న
  కన్నె ని సృష్టించిన ఓ
  చిత్రకారుడా నీకు నీవే సాటి
  అన్నట్టుంది కదూ.

  ReplyDelete
 8. కడవనెట్టుకొన్న రాయంచ చెరువుగట్టు మీద నడచుచుండ..
  రెప్పదాటుకొన్న చూపు పడతి చనుకట్టు మీద పడుచుండ..
  పిక్కదాటుకొన్న అతివ చీరకట్టు మదిన మరీచికలు వీచుచుండ..
  మనస్సు దోచుకున్న మగువ కనికట్టు ఎద చప్పుడు దోచుచుండ..

  అలమెల్లన కదిలే రమణి కృష్ణవేణి జంటసర్పాలేమో అనిపించుచుండ..
  వాలుకళ్ళలో మెదిలే తొయ్యలి భావమోహనం రాగ వీచికలు ఆలపించుచుండ..
  పల్లెలో విరిసిన మానిని ముగ్ద మోహన సౌందర్యం ఎంకిని తలపించుచుండ..
  సుదతి ముఖారవిందం చూసి పద్మమేమో అని భ్రమరం భ్రమించుచుండ..

  లలన ఆలన మెల్లన వయ్యారియై, భీతన హరిణేక్షియై..
  చెరువు గట్టు దాటి, పుట్ట దాటి పల్లెవైపు సాగిపోయింది.

  ReplyDelete
 9. pruthvi village ammayi ammayakatvam, bidiyam clear ga kanipistundi ne photo lo, superrr

  ReplyDelete
 10. చాలా బాగుందండి. రంగులు ఆహ్లాదంగా ఉన్నాయి.
  ----
  అమ్మాయి ఎడమ చేయి జారినట్టు లేదూ.

  ReplyDelete
 11. కవితకు చక్కటి బొమ్మవేయడం, బొమ్మకు కవితల్లాంటి మాటల్లో అభిప్రాయాలను సందేశాలను తెలియజేయాటం, కష్టసాధ్యమయినప్పటికీ నా బొమ్మకు స్పందించి కూడలి వేదిక పై చక్కటి బావప్రకటన గావించినందులకు అభినందనములు. ప్రశంసనీయము. పలువురు మెచ్చినందులకు కృతజ్ఞుడను.
  (ఎవరికైనననూ నే గీసిన బొమ్మలు స్పూర్తిదాయకంగా, అందంగా, మీ కవితలకు కానీ బావుంటే నిరబ్యంతరముగా బ్లాగుల్లొ పెట్టుకొవచ్చు, అందులకు సంతోషము.)
  మీ
  భవధీయుడు
  పృథ్వీరాజు వర్మ

  ReplyDelete
 12. SIMPLY SUPER. WHETHER SHE IS MISS OR MRS?

  ReplyDelete
 13. వర్మ గారు చాలా బావుంది, నాకు ఏందుకో మిమ్మలను కలవాలని ఉంది. అసలు చాలా బావుంది. Krishna Rao గారు Mrs అయినా మిస్ అయినా బొమ్మ మాత్రం కేకండీ..

  ReplyDelete