కనురెప్పల స్నేహం

కత్తి మహేష్ కుమారు గారు, సూపర్బ్. నా మనసులోని బావాన్నీ వ్యక్తపరిచారు.. లైక్ ఇట్ వేరి ముచ్. మీకు హృదయపూర్వక అభినందనములు..మీ ప్రతిస్పందనకు నా జోహార్లు. మీ కవితను ఇలా పొందుపరుచుకుంటున్నను నా కళాస్పూర్తి హృదయంలో...:)

నీ కళ్ళల్లో
ఎంత స్నేహం !
ఉంటే మాత్రం నాకెందుకు,
చెలిమి కోసం నేనెంత అలమటించినా
కనీసం నువ్వు చెయ్యైనా చాపలేదే?
ఈ స్వార్థపు ఎడారి మధ్యలో
దాహమంటూ ఎంత అరచినా,
నీ కళ్ళవాకిలి దాటి వచ్చి
నేస్తమా! అని నా దప్పిక తీర్చలేదే?
చెయ్యిచాపని చెలిమికి
నీ కారణాలు నీకుండొచ్చు.
నీ కళ్ళలోని స్నేహాన్ని,
గుడ్డిదనుకోవడానికి
నా కారణాలు నాకున్నాయ్!


@ పృథ్వీ,
కలిసిరాని కాలమొకటి కదిలివచ్చెను కోరికోరి
తరిగిపోయెను స్నేహమొకటి మరొకరి ప్రేమ కోరి
జరిగిపోయెను ఇలా జీవితము నా జాగృతము కోరి
మరువలేక మరిచినాను ఆమె మంచి కోరి
ఐనా, విడువ లేక పోతున్నాను ప్రియమైన స్నేహమును కోరి
కాలగర్బపు కటికచీకటి కనిపిస్తున్నది నా కంటి నీరై...

( ఎప్పటికి తోడు నిలిస్తే అది ప్రేమవుతుంది, స్నేహం కాదు. ఎప్పటికీ విడిపోతే స్నేహం కూడా వుండదు. నా కనులను ఎప్పటికీ తెరిచివుంచలేము, ఎందుకంటే అంతా వెలుతురే.. అలాగని ఎప్పటికీ మూసి వుంచాలేను, అంతా చీకటే. అందకారమయం. అలా నా కనులకు కనురెప్పల అవసరం వుంది. నా జీవితానికి నీ స్నేహం అవసరముంది. మనకనురెప్పలస్నేహం ఎప్పటికి నిలిచివుండాలి.)

10 comments:

  1. నా కళ్ళ లో ఉన్న నీ స్నేహం జారిపోకూడదని,
    నేను గాంధారినయ్యాను.

    ReplyDelete
  2. నీ కళ్ళల్లో ఎంత స్నేహం !
    ఉంటే మాత్రం నాకెందుకు,
    చెలిమి కోసం నేనెంత అలమటించినా
    కనీసం నువ్వు చెయ్యైనా చాపలేదే?
    ఈ స్వార్థపు ఎడారి మధ్యలో
    దాహమంటూ ఎంత అరచినా,
    నీ కళ్ళవాకిలి దాటి వచ్చి
    నేస్తమా! అని నా దప్పిక తీర్చలేదే?
    చెయ్యిచాపని చెలిమికి
    నీ కారణాలు నీకుండొచ్చు.
    నీ కళ్ళలోని స్నేహాన్ని,
    గుడ్డిదనుకోవడానికి
    నా కారణాలు నాకున్నాయ్!

    ReplyDelete
  3. Excellent, చాలా దగ్గరికొచ్చేసారు మహేష్ కుమారు గారు నేను చెప్పలెనిది చెప్పేసారు.నా మనోగతం అలాగెవుంది అందుకే అలాంటి బొమ్మలు వేసాననుకొండి. చాలా సంతోషకరంగా వుంది. మీ సరైన స్పందనకు spcl thnx..

    ReplyDelete
  4. అద్భుతమైన చిత్రం. చిత్రంతో పోటీ పడుతున్న మహేష్ గారి కవిత.
    పృధ్వీ గారు, మీరు కళ్లను చాలా బాగా చిత్రిస్తారు.
    మళ్లీ కలుద్దాం

    బొల్లోజు బాబా

    ReplyDelete
  5. బొమ్మ సూపర్. కవిత కూడా చాలా బావుంది.

    ReplyDelete
  6. WOW........... beautiful eye...

    ReplyDelete
  7. మహేష్ గారూ మీ కవి హృదయానికి ప్రణమిల్లుతున్నాను.

    నీటిమీద రాతకాదుగా మన స్నేహం
    రెప్పపాటుకే చెరిగిపోవడానికి
    నిజమవ్వని కలకాదుగా మన స్నేహం
    కంటనీరుగా జారిపోవడానికి
    అలాగని
    చరిత్ర కాదుగా మన స్నేహం
    యుగాలుగా సజీవమవ్వడానికి
    స్నేహమొక్కటే కాదుగా జీవితం
    క్షణ క్షణం కాపాడుకోడానికి

    ReplyDelete
  8. కన్నుల్లో స్నేహం కలకాలం ఉంటుంది అని చిత్రం లో చెప్పిన భావం బావుంది
    కాని అంతలోనే స్నేహాన్ని తప్పు పట్టే కవిత్వం లో బాధ కి మనసు మూగబోయింది
    నిజమే ఎవరి కారణాలు వాళ్ళకుంటాయి గా
    మొత్తానికి అర్ధాన్నిచ్చే రెండు చాలా చాలా కలిసాయి
    మహేష్ అండ్ పృథ్వీ లకి మంచి జోడి కలిసినట్టు [:)]

    ReplyDelete
  9. @రాధిక, నెనర్లు. ‘కవిహృదయం’ అని మీరు తెలివిగా కత్తిపోట్లు తప్పించేసుకున్నారు.

    ఎప్పుడూ భావావేశమేనా, కాస్త కోపమూ చూపిద్దామని ఇలా కొంత కల్పన చేసాను. నచ్చినందుకు నెనర్లు.

    ReplyDelete