చూడాలని ఆశగా వుంది.


చిత్రానికి అద్భుతంగా కవితరాసి స్పందించిన కత్తి మహేష్ కుమార్ గారికి
మనస్పూర్తిగా అభినందనలు.

నా కళ్ళ నిరాశ

నుదుటి బొట్టై భాసిల్లుతుంటే,
నా గాజుల సవ్వడి
ఒంటరితనాన్ని పోగొట్టింది.
నా చెపి దుద్దులు
చెంప సిగ్గుల్ని ఆర్పేస్తే,
నా మెడలోని ప్రేమ గొలుసు
నన్ను ప్రేమగా అక్కున చేర్చుకుంది.
వేలికున్న ఉంగరం
బంధాన్ని తెంపుకెళ్ళిన చెలికాడి వేలిముద్రగా మిగిలితే,
నాకు ఆశనీ, దు:ఖాన్నీ నగలుగా వదిలి
ఆనందం మాత్రం చాటుగా తప్పుకుంది.

11 comments:

 1. నా కళ్ళ నిరాశ
  నుదుటి బొట్టై భాసిల్లుతుంటే,
  నా గాజుల సవ్వడి
  ఒంటరితనాన్ని పోగొట్టింది.
  నా చెపి దుద్దులు
  చెంప సిగ్గుల్ని ఆర్పేస్తే,
  నా మెడలోని ప్రేమ గొలుసు
  నన్ను ప్రేమగా అక్కున చేర్చుకుంది.
  వేలికున్న ఉంగరం
  బంధాన్ని తెంపుకెళ్ళిన చెలికాడి వేలిముద్రగా మిగిలితే,
  నాకు ఆశనీ,దు:ఖాన్నీ నగలుగా వదిలి
  ఆనందం మాత్రం చాటుగా తప్పుకుంది.

  ReplyDelete
 2. మహేష్ గారు, మీరు ఇలా అందంగా అంటుంటే ఇంకాబాగా బాగా గీస్తేబావుండునని అనిపిస్తుంది. మీ కవిత మాటలకి సిగ్గు తో బొమ్మ అందం రెట్టింపయింది. నిజంగా అమ్మాయిల అదృష్టం కాకపోతే బొమ్మాల్లో, కవితల్లో చేరిపోతారా. (నేను అమ్మాయినైతే నాకు బావుండునేమో అనిపిస్తుంది.:) కవిత Superb.

  ReplyDelete
 3. mahesh garu super andi, me kavita valla pruthvi bomma ki inka andam vacchindi, u both are superb, mimlni chustuntey koncham ego feeling ga vundi, naku ee talent ledey aniii

  ReplyDelete
 4. Hay, Satya, hw r u? Appude nee kantilo paddada.. choosesaava .hmm!!. ..cool. :D

  ReplyDelete
 5. అలవోకగా గీసిన బొమ్మలాగుంది.
  మహేష్ గారి కవిత బొమ్మని మింగేసింది.
  బొల్లోజు బాబా

  ReplyDelete
 6. బాబా గారు మీరన్నది సరియైనదే. కాని స్పందించడం ముఖ్యం అనుకుంటున్నాను. జనాలకు నా కాంసెప్టు నచ్చనట్టుంది బహుశ. ఐనా నా మనసు కు సేదతీర్చే ఇలాంటి బొమ్మలు వేయడం మాననండోయ్..:)

  ReplyDelete
 7. పృధ్వీగారు,
  నేనేమీ సీరియస్ కామెంట్ చేయలేదు సారు. మీరు అలవోకగా గీసారు, కనుకనే మహేష్ గారి కవిత మీబొమ్మను మింగేసిందని చమత్కారంగా చెప్పా అంతే. ఇందులో ఎవరూ ఎక్కువ ఎవరు తక్కువ అని నిర్ధారించేయ లేదు సారు. మీరు ఇలాంటి బొమ్మలు ఇంకా వేసి, మా మెదళ్లకు పదును పెట్టాలి.
  మరొ విషయం చెప్పనా, నేను బ్లాగులోకంలో నలుగురికీ తెలిసానంటే అది మీ బొమ్మకు నేను వ్రాసిన తెలుగుమోనాలిసా అన్న కవిత ద్వారానే అని నమ్ముతాను. కృతజ్ఞుడనై ఉంటాను.
  భవదీయుడు
  బొల్లోజు బాబా

  ReplyDelete
 8. నాలుగు గీతల్లో అమ్మాయిని సృష్టించేసారుగా.చాలా బాగుంది.మహేష్ గారూ అద్భుతంగా వుందండి.ఎంత చక్కని పోలిక.నిరాశ నగలుగా మిగిలిపోవడం.........ఓహ్....మీకు మనస్పూర్తిగా అభినందనలు చెప్పుకుంటున్నాను.

  ReplyDelete
 9. పృధ్వి గారు అలవోకగా గీసినా అందంగా వుందండీ.... మహేష్ కవిత బావుంది. మీ కాన్సెప్ట్ కూడా బావుంది. కళాస్పూర్తి ని కొనసాగించండి.

  ReplyDelete
 10. అద్భుతమైన బొమ్మ. ఈ సారి బ్లాగు పుస్తకం అంటూ ఎవరైన ఉపక్రమిస్తే మీ బొమ్మనే దానికి ముఖ చిత్రం గా రావాలి అని మనఃస్పూర్తిగా కోరుకుంటున్నాను.

  ReplyDelete
 11. చాలా సంతోషం. థాంక్స్ రవి గారు.
  కామెంట్స్ రాసి అభిప్రాయాలని తెలియజేసినందులకు అందరికీ కృతజ్ఝతలు.

  ReplyDelete