ఆమె ఒక శ్వాసకు నిలయం ఐతే
మన ఆకలి ఖర్చులకు విరివిగా పేల్చేసుకుంటున్నాము
ఊపిరి ఆపకుండా ఆ సిరిని కాల్చేసుకుంటున్నాము.
ప్రకృతమ్మ పచ్చని కన్నుల్లో కన్నీళ్లను తెప్పించి
ఫ్యాక్టరీల పొగలతో బ్రతుకులను ఆర్పేసుకుంటున్నాము.
మండే సూర్యుడికి సైతం మసిపూసేసి
మట్టిలో మంచినీళ్ల కరువు తెప్పించు కుంటున్నాము.
అల్లరి జనానికి కూసే కోయిలలు కరువై
నిద్రలో రాని కలలను నిజము చేసుకుంటున్నాము.
అందమైన రేపటి ఆకారాన్ని మనమే చేర్పేసుకుంటున్నాము.
మీ ఫొటో వెరైటీ గా ఉంది. చిన్న డౌట్ ఇది ఫొటొనా లేక చిత్రమా?
ReplyDeleteబొల్లోజు బాబా
ప్రేమంటే...
ReplyDeleteనీ వేలితో నీ కన్నే పొడుచుకోవడం,
అని నా మిత్రుడి అనుకోలు.
కన్ను పొడుచుకునైనా...
ఆ ప్రేమ తడి అనుభవించాలని నా వేడుకోలు.
ఆ అనుభవం వెలుగులో,
జీవితం ఒక ఉదయకిరణంలా అనిపిస్తుంది.
అది కేవలం అనుభవిస్తేనే తెలుస్తుంది.
బోల్లోజు బాబా గారికి, మహేష్ గారికి నమమస్కారములు.
ReplyDeleteబాబా గారు, సిస్టమ్ సమస్యల్లొ వేసిన కొన్ని చిత్రములను పొగొట్టుకున్నా స్నేహమా..భ్లాగుకర్త ప్రొత్సాహంతో కృషితొ వేసానండి. చిరిగిన నోట్ అయిన చెల్లినట్లు క్లారిటి తగ్గినా నా కళ తగ్గదుగా. అందుకే బ్లాగులొ పెట్టా..
మహేష్ గారు.మీకు చాలా దన్యవాదములు.సూటిగా ఘాటుగా తగిలేలా చెప్పారు.మీ కవితా కామెంట్ కి కృతజ్జుడను. ఇలా కవితాస్పూర్తిని కలిగీంచేలా నా బొమ్మలు వుండాలని నేను ఆసిస్తున్నాను.ఇంకా రెస్పాంస్ కొరకు ఎదురుచూస్తూనే వుంటాను.
చిన్ని గాయానికే అలా కన్నీళ్ళు పెట్టకు
ReplyDeleteఆ కన్నీటితో ఉదయిస్తున్న సుర్యుని వలే
వున్న నీ లక్షాన్ని మసకబారనీయకు
అరుణ
మహేష్ గారూ,
ReplyDeleteమీ స్పందన బాగుంది.
మీరు బ్లాగుల్లో కవిత వ్రాయటం మొదటి సారి చూస్తున్నాను.
ఫైన్ .
బొల్లోజు బాబా
బాబా గారూ, కవితలు రాయడం నాకు పెద్దగా చేతనవ్వని ప్రక్రియ. ఏదో ఇలా ఒకరు ప్రేరణ పొంది రాయమంటే పదాలు కాస్త అల్లానే గానీ, కవిత రాయలేదండోయ్!
ReplyDeleteమీ చిత్రం బాగుందండి.అగ్గిపుల్ల వెలుగు సూర్యునితో పోటీ పడుతున్నట్టుందండి.
ReplyDelete