స్నేహం తో ..


రాళ్లలాంటి మనుషులను కూడా కలుపుకునే మీ మనసుకు
నీడల్లావెంటాడే ప్రతిబందకం చుట్టేస్తుందంటే ఎలానమ్మేది.
గాలిపటానికి దారం ఆధారం కాకుంటే సాగేపయనం ఏమవుతుందొ తెలియదా.
బ్రతుకుకు బందం అడ్డువస్తే జీవితం ఎలా నిలుస్తుంది.
తెంచుకుంటే ప్రేమబందం ఎలా అల్లుకుంటుంది.
అందమైన మీ మనసుకు కదిలించే ఈ ఆటుపోటులు తగులునా?
కదలని ఆ మనసుతో ఇలా కన్నీరు కార్చటం మీకు తగునా?
కలసిరాని తోడును కంచెవేసి కట్టుకున్నావు కదా.
మరి దరిచేరిన ఆ దు:ఖం లొ కుమిలిపోతావెందుకు?
నిరాశ వొడిలో, ఈ కన్నీటి వరద ల్లో ఇంకా ఎన్నాళ్ళు?
నా స్నేహపు జడివానల్లో సంతోషపు ఉప్పెనలు కురువనివ్వు.
ప్రియమైన స్నేహంతో మనసునిండా ఓదార్పును కలుగనివ్వు.


కవితకాదిది, ఓ బ్లాగరి కన్నీటి మనోవేదన ఆమె కవితల్లొ వెల్లడించినందుకు నేను రాసిన ఓదార్పు కామెంటు.

1 comment:

  1. Hi Pruthvi gdm.[:)]

    "Sneham tho" kavitha lo Odaarpu nivvalanna mee prayatnam chaalaa bagundi Nijame Snehamane oka aadhaaram prathi jeeviki undi teeraali anduloni Odarpu ki kaasta seda teere manasu ki haayi gaa anipistundi


    "Kopa Thapaalu leni Chelimi Kaavali

    Panthaalu Pattimpulu leni Sannihityam kaavali

    Chiru thagavulunna Muripaala Nestam kaavali

    Nammakame neevanipinche Sneha Hastam kaavaali

    Ituvanti Sneham Yrppatiki Ravaali
    "Pche"

    Raanidani telisi enduku aasinchaali?"

    ReplyDelete