మేల్కొలుపు

కనిపించిన సత్యాన్ని అనుభవించాలని
అందని ఆధారాన్ని ఆశ్చర్యంగా చూస్తుంటే
ఈ వాస్తవ గాఢనిద్రలో అనుకోని
స్వప్నాలు ఎన్నెన్నో కనిపించాయి.

అంతలోనే ఆకర్షించే అందాలు
అలవాటుగా ఆనందం అందిస్తుంటే
మంచి చెడ్డల నిమ్నోన్నతలను మరుగున పెట్టలేక
ఉద్దీపనల ఆద్యాంతాలను ఆసాంతం చూసాను.

అలోచనల గీతలను
నా ఏకాంతపు హద్దులు దాటించేసి
ఒళ్లంతా కళ్లుచేసి విరబూసి చూస్తుంటే
నిస్పృహతో ఆ అందాలు విసిగేసి చూసాయి.

అప్పుడే నా అంతరంగంలో ఆనందసంవేదనలు
మేల్కొనివున్న నన్ను నిద్రనుండిలేపాయి.

1 comment:

  1. చాలా బాగుంది
    బొల్లోజు బాబా

    ReplyDelete