తెలుగు మోనాలిసా



ఈ చిత్రం పై సాహితీయనం నుండి స్పందన కమనీయం.
అతడామేను
నడిచే చందమామ అని
పరచుకొనే వెన్నెలని
నిలచిపోయిన హేమంతమనీ అని వర్ణించాడు.
ఆమె కళ్లను
బటర్ ఫ్లై విప్పారిన రెక్కల ద్వయమనీ
ఆత్మలోక ద్వారాలనీ
రెండు పున్నమిలనీ
మిగిలిన దేహమంతా
ఆ రెండు కళ్లకూ పొడిగింపనీ అన్నాడు.
ఆమె చూపుల్లో
ప్రేమలోక సంగీతముందనీ,
కాంతులీను కరుణా ఝురిలున్నాయనీ,
అమరత్వానికి ఆహ్వానాలున్నాయనీ అన్నాడు
ఆమె మాటలు
నెరళ్లు తీసిన నేల అడుగున
ఉండే విత్తును మొలకెత్తించే ఆర్ధ్రతనీ,.
పరాజితుడిని కూడా అజేయుడిని
చేయగలిగే మంత్రమోహన శక్తులనీ,
తేనె జలపాతాలు కుచించుకుపోయి
పెదవులపై తారాడే శబ్ధతరంగాలనీ,
ఎన్నో అన్నాడు.
అతడామె గురించి చాలా చెప్పాడు.
కానీ ఆమె మాత్రం
ఒక చిరునవ్వు శాపమిచ్చి సాగిపోయింది
తెరచాటు మనిషి కదా!

8 comments:

  1. బుసాని గారికి
    నమస్తే
    http://pruthviart.blogspot.com/2008/04/blog-post_30.html చిత్రానికి నేను వ్రాసిన కవిత నచ్చినందుకు సంతోషం. అనుమతి ఇచ్చినందుకు కూడా ధన్యవాదాలు.


    ఈ చిత్రం పై నా స్పందన

    ఒక తెలుగు మోనాలిసా

    అతడామెను
    నడిచే చందమామ అని
    పరచుకొనే వెన్నెల ని
    నిలచిపోయిన హేమంతమనీ
    అని వర్ణించాడు.

    ఆమె నవ్వును
    పూల పరిమళంతోను
    సెలయేటి స్వచ్చతతోను,
    రత్న కాంతుల సవ్వడితోను పోల్చాడు.

    ఆమె కళ్లను
    బటర్ ఫ్లై విప్పారిన రెక్కల ద్వయమనీ
    ఆత్మలోక ద్వారాలనీ
    రెండు పున్నమిలనీ
    మిగిలిన దేహమంతా
    ఆ రెండు కళ్లకూ పొడిగింపనీ అన్నాడు.

    ఆమె చూపుల్లో
    ప్రేమలోక సంగీతముందనీ,
    కాంతులీను కరుణా ఝురిలున్నాయనీ,
    అమరత్వానికి ఆహ్వానాలున్నాయనీ అన్నాడు.


    ఆమె మాటలు
    నెరళ్లు తీసిన నేల అడుగున
    ఉండే విత్తును మొలకెత్తించే ఆర్ధ్రతనీ,

    పరాజితుడిని కూడా అజేయుడిని
    చేయగలిగే మంత్రమోహన శక్తులనీ,

    తేనె జలపాతాలు కుచించుకుపోయి
    పెదవులపై తారాడే శబ్ధతరంగాలనీ,

    ఎన్నో అన్నాడు.
    అతడామె గురించి చాలా చెప్పాడు.

    కానీ ఆమె మాత్రం
    ఒక చిరునవ్వు శాపమిచ్చి సాగిపోయింది
    తెరచాటు మనిషి కదా!


    బొల్లోజు బాబా
    http://sahitheeyanam.blogspot.com/

    వీలైతే నాబ్లాగు ను దర్శించి ఏదైన ఒక కవితకు చిత్రాన్ని గీయరూ?

    ReplyDelete
  2. మీ ఊహాసుందరి చాలా బాగుంది.అతి చక్కని చిత్రాలలో దీనిని కూడా చేర్చవచ్చు.

    ReplyDelete
  3. Pruthvi nee oohasundari
    gurinchi raayalani coment box open chesesariki Bolluju BaBa gaari coment thoo koodina kavitha chadivesariki emi raasina takkuve anipistundi
    chuse kannulloni oohalani kalipina kavithalani puttinchina aa ooha chitraala chinnadaanni chitrinchina oo chitraakaarudaa ide naa abhipraaya nivedika

    Thanks

    UshaRani

    ReplyDelete
  4. Prithvi Garu,

    Mee bommalu adbhutam.
    Oka daanni minchi okati aascharyaanni kaligistunnai.

    My first impression on Telugu Monalisa was I can't figure out whether its more feminine or masculine.

    Da Vinci Code pustakam naa meeda ekkuva prabhaavam choopistondemo???

    Chitraaniki mee inspiration ento cheppagalaru...

    cheers,
    Chakri

    ReplyDelete
  5. చక్రిగారు నమస్కారములు.
    చిత్రములు నచ్చినందులకు, నా ఆర్టును మెచ్చినందులకు కృతజ్ఞుడను.మీ బ్లాగుగురించి తెలుపలేదు. మీరెవరో తెలియటంలేదు.

    ఆమె నను చూసిన చూపుల దోరణి లో ఆ అమ్మాయి ముఖ సౌష్టవము నా మనసులో ముద్రించుకపోయిన తరుణానికి నా స్పందన ఈ చిత్రాన్ని గీయటానికి ఇన్పిరేషను అని తెలియజేసుకుంటున్నాను. మంచి ప్రశ్నవేసి తెలుసుకున్నారు. మీరు మీవివరాలు మరొకసారి తెలుపగలరు.

    ReplyDelete
  6. జలతారు తెరచాటు కలువ కన్నుల బేల చూపులు,
    నా మనస్సులో వేలవేల కావ్యాలు.

    ReplyDelete
  7. Raju Varma gariki

    Your paintings superb, particularly in coloring and imagination, very good composition.

    Thanks
    Kalasagar, artist

    ReplyDelete