సార్థకం

ఎన్నెన్నో విషయాల్లో
మరెన్నో ఊహల్లో
కన్నాను కనువిప్పుతూ కమనీయ అనుభవం

విజ్ఞానపు మలపుల్లో
ఉత్సాహ స్పృహల్లో
ప్రయత్నించ సాగాను, పరమళం వెదజళ్లాను

విలక్షణ మనోరథమై
విచలిత మనస్సుతో
అలసటలేని తీరాన ఆవేదన పంచాను

భారవంత జీవితాన
పిరికితన పరుగుల్లో
బ్రతుకనేర్చిన పులి అడుగులు నిలిపాను

ఈ జీవిత మహారణ్యంలో
దీనభాందవ శరణుజొచ్చినాను.

No comments:

Post a Comment