కవి నెరుగని
కవి భావమెరుగని
కవితలెందుకు?
కంటి విలువ
కన్నీటి విలువ తెలియని
ఏడుపులెందుకు?
చదువునేర్చిన పిదప
బ్రతుకు మార్చని
చదివిన చదువులెందుకు?
చేయగూడని పనుల చేతలెందుకు?
భావమెరిగిన పిదప
బదులివ్వని భావనలెందుకు?
జీవన పథంలో
జ్ఞానాన్ని ఇచ్చే పుస్తకాలుండగ
పనికిరాని దృశ్యకావ్యములెందుకు?
విర్రవీగే భావరహిత జీవిత కథనంలో
అంతులేని ఆశలెందుకు?
అంతుపట్టని అంతమెందుకు?
నీటి బుడగలాంటి మనిషి బ్రతుకెందుకు?
చాలా ప్రశ్నలు వేసారు.మీ ప్రశ్నల్లోనే చాలా వరకూ సమాధానాలు వున్నాయి.
ReplyDeleteకంటి విలువ,కన్నీటివిలువ తెలియని వాళ్ళే ఎప్పుడూ ఏడుస్తూవుంటారు.
చదువు బ్రతుకును మార్చదు.బ్రతకడానికి ధైర్యాన్ని,దారిని ఇస్తుంది.[హేపీడేయ్స్ సినిమాలో చెపుతాడుగా]
భావనకి మనమిచ్చుకునే బదులే భావమేమో?
పనికిరాని పుస్తకాలు చాలానేవున్నాయి.అలాగే మంచి దృశ్యకావ్యాలూ వున్నాయి.దేన్ని తక్కువ చేయలేమేమో?
అక్కరలేని ఆశలు పెరిగిపోయాయి కాబట్టే జీవితం భావరహితం గా మారుతుందని అనుకుంటున్నాను.
ఇక చివరిగా నీటిబుడగ జీవితం వందేళ్ళు కాదనుకుంటాను.