మౌన సంభాషణ

వొంటరి క్షణాలు ..
యెదురుచూస్తున్న ఆలోచనలు
తోడుకోరే ఆశల దారులు ప్రక్కప్రక్కనే దొర్లుతున్నాయి
గోలచేసే పిచ్చి మనసు వెంటవెంటనే త్రుల్లి పడుతున్నది
మాట్లాడే మనిషి తోడు లేకున్నా
గుండెలోనే ఏకాంతం మూగభాషలు పలుకుతున్నది
హద్దులేని ఈ భాషను అర్థం చేసుకునేదెవరు?
తనివితీరా ఏకాంతం పంచుకునేదెవరు?
మనసు భాషకు బదులు చెప్ప వీలులేదేమో !
నీవులేని నా గొంతుకు మాట రాదేమో !

2 comments:

  1. నేను కవితలా చెప్పలేకపోయాను.దానికి మీరు అందమయిన రూపాన్నిచ్చారు.
    ఒంటరి క్షణాలకోసం ఎదురు చూస్తున్న ఆలోచనలు అనడం చాలా బాగుంది.నీవు లేకపోతే గొంతుకు మాటరాదనడం,తోడుకోరే ఆశల దారులు పక్క పక్కనే వున్నాయనడం ....వ్యక్తీకరణ చాలా బాగుందండి.కానీ అక్షరదోషాలు బాగా వున్నాయి.సరిదిద్దుకోగలరు.

    ReplyDelete