వీణాపాణి


కనులు మూసిన, కనులు తెరిచిన నడిపించు దైవము నీవేలే
కనుల ముందు కానవచ్చెడి లలిత కళల కళారూపము నీవేలే
చదువగోరిన చిట్టి చిన్నారి చెక్కిలి పలుకులు నీవేలే
విద్య నేర్చిన వినయ శీలికి విలువ నిచ్చు వీణాధారివి నీవేలే
విద్య నేర్పే పెద్ద మనిషికి చెంత నిలుచు వరదాయిని నీవేలే
ఇంపుసొంపుల కలము కట్టిన పుస్తకధారిణి నీవేలే
కవుల చెంతన కవితలల్లెడి కవిత హృదయము నీవేలే
మునుల ఎదలో ముత్యాలు పలికించు మూల దైవము నీవేలే
మూగ బ్రతుకులను ముచ్చటించు బుద్దిధాత్రివి నీవేలే
నీ నీడ జేరిన బాటసారికి వెలుగు జూపెడి దివ్య రూపము నీవేలే
భక్త కోటి పూజలందు భక్తి శ్రద్దల దివ్య ఫలము నీవేలే
ఎల్లవేళల మేము గొల్చెడి జ్ఞాన దాయిని నీవేలే
మా చదువులమ్మవు నీవేలే.

3 comments:

 1. ఓక సన్డే హాఫ్ డే కృషి ఫలితం ఈ బొమ్మ. అన్నిట్లో చాలా బాగా కష్టపడ్దాను సిస్టమ్ పై గీసిన బొమ్మల్లో, ఇది అంత ఫేయిర్ గా రాకున్నా నీననుకొన్న స్టయిల్ వచ్చింది. కాని కామెంట్ నేనే రాసుకోవల్సి వస్తుంది.గీసిన కొన్నయినా ఆణిముత్యాల్ల వుంటే అది చాలు నాకు.ఏమీ ఆశించకున్నా కృషి నేర్పే ఫలితం చాలు నాకు.

  ReplyDelete
 2. పృథ్వీరాజు గారు , చాలాబాగుంది
  సిస్టంలో ఇంత చక్కగా గీయొచ్చంటే ఆశ్చర్యంగా ఉంది
  హ్యాట్సాఫ్
  జీవి(గోపాల్ వీరనాల)
  జీవి ముచ్చట్లు (Gv-Blog)
  జీవిత(o)-జీవీ కవిత్వం

  ReplyDelete
 3. మీ లాంటి వారి సలహాల వల్ల ఫొటోశాప్ ను ఉపయోగించడం మెల్ల మెల్లగా ఈ మద్యనే ప్రయత్నం చేసాను. ప్రతి ఒక్కరూ ఇలా try చేయమని అంటుంటే మరి కష్టమైనా నచ్చిన వారి కోసం ఇష్టం పెంచుకొని ఇదిగో ఇలా వేసేస్తున్నాను. మీకు దన్యవాదములు.

  ReplyDelete