నా కన్నుల్లో కదిలాడే కలవరమా...
ఈ కన్నీళ్ళ కథలెందుకు కన్నావు?
ఆశగా అభిమానం తో ఆరాదిస్తుంటే
అనుమానం తో అంత దూరం చేసావెందుకు?
కలకాలం కల్సివుండాల్సిన మనల్నిచూసి కాలం కన్నెర్ర జేస్తే
కనిపించని దూరానికి కదిలి వెళ్తావా?
కోరుకున్నంత కాలం కష్టాలను కలిగించనంటుంటే
కనికరము చూపక కరువై పోతావా?
కలలో కూడా నిన్నే చూడాలనుకున్నాను
కానీ, కలలా కన్పించి కనుమరుగై పోతావా?
కళాకారుడననైన నాపై కాస్తంత కరుణ చూపలేవా?
దూరమైన నీవు దగ్గరై నా దరి చేరలేవా?
బాగా రాసారండి.బొమ్మ అద్భుతంగాఉంది.
ReplyDeleteరె౦డవ సారి నేను డైరెక్ట్ సిస్టమ్ పై పేపరు పెన్ను లేకుండా వేసాను. ఇలా వేస్తే కూడా ఆర్ట్ విలువ వుంటుందా అన్నడౌట్ తలెత్తుతుంది నాకు.కానీ నేను అనుకున్నది మాత్రం గీయలేదు మీకు నాకు నచ్చినా.నా కామెంట్ నాట్ బాడ్.ఐ నాట్ సాటిస్ ఫైడ్.
ReplyDeletechala bagundi pruthvi, virahabhada enta kastam ga vuntundo cheppavu, nuvvu super
ReplyDeleteఏమోనండి నాకైతే చాలా నచ్చింది ఈ బొమ్మ.
ReplyDeleteఏవో భావాలు పలుతున్నట్లుంది ఆమె ముఖం,
డైరెక్ట్ గా వేసారంటే ఇంకా చాలా గొప్పవిషయం అది.
హాయ్..నా పేరు లావణ్య , చిత్తూరు. ఆర్టిస్ట్ కానీ ఇలా కవితలు కూడా రాయలేను. విషయం చక్కగా ఉంది. మీ మెయిల్ ఐడి ఇవ్వగలరా. విశ్ చెప్పాలి. అర్ట్ ఇస్ ఎక్స్లలెంట్.
ReplyDelete