ఆ రోజును ఆహ్వానిస్తున్నాను..


మాటలు, భావామృత చుక్కలు

చూపులు, అనుబందపు తొలి గొళ్లెములు

చెక్కిళ్లు, చేమంతి పూరేకులు

సన్నటి నడుము, మల్లెతీగ వంపులు

సుగుణ శీలి, ఎవరో కాదు ఆమె

నన్ను వెతికి వచ్చిన ఆనంద సిరి.

నేను వెతకబోయిన సొగసు గడుసరి.

అందంగా అక్షర భాష లో అభివర్ణించలేకున్నాను.

మళ్లీ ఆమెను చూసే రోజును ఆహ్వానిస్తున్నాను.

2 comments:

  1. మీరు కవితలకు పెట్టే టైటిల్స్ చాలా బాగుంటున్నాయి, అలాగే మీరు గూగుల్ యాడ్స్ తీసివేస్తే మంచిదేమో ఎలాగూ అవీ న్నీ డబ్బులు రాని యాడ్సే కదా!

    ReplyDelete