ఇది తగునా?..


చూపులతో చుట్టేసి చూపుకు అందకుండా వెళ్ళావు
నిలువుటద్దంలా కన్పించి నిలువునా నను కాల్చేసావు
నీ కలువ కన్నుల్లో కలలను దాచుకొని
నా కన్నుల్లో కలతలను రేపావెందుకు?

అందుకే అప్పుడప్పుడూ ఆలోచించాను ఆనందంగా విడిపోవాలని, కానీ
ఇంకా అందంగా అనుబందం పెంచి ఆలోచనలు రేపావు.
సాక్ష్యం లేని స్నేహంతో సమస్యలెన్నో సృష్టించావు.
ఆశలన్నీ అందించి అద్భుతాలెన్నో చేశావు.
పరువాలు పరిచి పరుగులు తీయించి పిచ్చివాడిని చేశావు.
కదిలే కాలంలో కలకాలం ఆగని కన్నీళ్ళు తెప్పించావు. ఇది నీకు తగునా?

3 comments:

  1. కవితలోకన్నా ఆ చిత్రం లోనే ఎక్కువ భావాలు కనిపిస్తున్నాయండి.మీ కలానికన్నా కుంచెకే మాటలెక్కువ.ఆ చిత్రంలోనే నా కళ్ళు చిక్కుకుపోయాయి.

    ReplyDelete
  2. మీరన్నమాట వాస్తవమే.ఒప్పుకుంటాను కానీ నా కవిత లో భావప్రకటితము వృదా అవుతున్నది.చిత్రంగీసినంత సులభంగా చక్కగా కవిత రాయలనుకుంటున్నను. మీ కామెంట్ ప్రోత్సాహానికి ధన్యవాదములు.

    ReplyDelete
  3. సాక్ష్యం లేని స్నేహం.. భావ వ్యక్తీకరణ బాగుంది. కవిత చాల నచ్చింది నాకు.

    ReplyDelete