.

5 comments:

  1. అర్థనారీస్వరమా మన బంధం?
    ఒకకంట కన్నీరు, ఒక కంట పన్నీరు నిత్య పారాయణమా?
    ఆ రెంటి పాత్రల నిడివి, నడతా మారని సత్యసంధానమా?
    లౌకిక స్వరంలో అనునిత్యం నీవాలాపించే గీతాలు,
    మౌనంగా సాగే నాలోని ఓంకారానికి కావా శాపాలు?
    నీలాకాశమంత నీ ఆశల వలయంలో నేను బందీనా?
    మరి నా నిట్టూర్పు అగ్నికీలల సెగ నీకు తాకదేం?
    నువ్వూ నేనూ వేరా? నాలోని నువ్వు నేనేనా? ఎవరం మనం?

    ReplyDelete
  2. కల్లోల సంసార సాగరంలో
    బడబాగ్నిని దాచుకున్న హృదయంలోంచి,
    ద్వందాలకతీతమై
    ఋషినై
    సహస్రారంనుంచి విడుదలై
    ప్రణవంలో కలిసిపోనా

    ReplyDelete
  3. ఓంకారాన్ని మనిషి తలపైన చిత్రీకరించి,
    దాని ఉపాసన తోనే, ఆ యోగం తోనే
    కన్నీటి కడలి తేలిపోతుందని , తేలికవుతుందని -- (కడలిని పైన, మంటలు కింద వేయడం ద్వారా)
    బాధల బడబాగ్ని హృదయాంతరాళాలలోకి అణిగిపోతుందని -- (కనీళ్ళల్లో పుట్టిన మంట కనక బడబాగ్ని అన్నాను)
    సుఖ దుఖాల ముసుగుల్లో దాగిన మనిషి
    వాటికి అతీతంగా స్థితప్రజ్ఞుడవుతాడని,
    అవి మిధ్య అని తెలుసుకుంటాడని, తరిస్తాడని.

    మీరు వ్యక్త పరిచినట్టుంది మీ చిత్రం.

    ఒక కవితలో బంధించలేనన్ని ఊహలు మీ చిత్రాల ద్వారా మాకు అందిస్తున్నారు
    ఆలోచనలు రేకెత్తిస్తున్నారు. మీరిలా మరిన్ని వి-చిత్రాలతో మా ముందుకొస్తారని
    ఆకాంక్షిస్తూ.. ఎదురుచుస్తూ ఉంటాను

    ReplyDelete
  4. ఉష గారికి,విజయమోహన్ గారికి, ఆత్రేయగారికి ధన్యవాదములు. మన తెలుగు పదనిఘంటువులతో మీ కవితామృతాన్ని చిలికి నాతో పంచుకున్న మీ కళాహృదయానికి మరోసారి హృదయపూర్వక అభినందనములు తెలుపుకుంటున్నాను.
    గీయగలిగిన చిత్రాలను, మంచి ఆలోచనలు బ్లాగర్ల దృష్టి పడాలని పదిమంది చూడగలగాలనేది నా ప్రయత్నం. తద్వారా కొంతమార్పు అంతే.. గొప్పతనంమో వెర్రితనమో చాటుకోవడం ఉద్దేశంకాదు. స్వ అభిప్రాయాలెన్నివున్నా చుక్కానిలా విమర్శలు దారిమర్లించగలవని,పొగడ్తలు అభిప్రాయాలు అలల్లా ముందుకు నెట్టగలవని, అవి ఆలోచనావైఖరినేమనా మార్చగలిగేవనే ఉద్దేశం కొంత కలుగుతున్నది అంతే..

    ReplyDelete
  5. Hai, hello, Namasthe andi. Superb going on your blog series of fotoes.
    Most expressive moods they are. Again Congrats.

    Meghalatha
    Ooti,Tamilnadu.

    ReplyDelete