రంగుల కలలు

చీకటి వేళల్లో, వెన్నల వెలుతురులో,
నిద్దుర వేదికపై, పొద్దుటి వేకువలో,

కనుల వెనుక నింగి కౌగిలి తెరలో,
కమ్మని కలల చాటున, మదిలో,
నెమ్మది వెన్నల హాయిలో,
నా అంతరంగ అభిమాన పొరలలో,
భావసుమాల ఆలోచనా శృతులలో,
కనురెప్పల కవ్వింతల

అనురాగాపు పులకింతలు ఏమిటో?
మురిసిన నా ఆశల ముంగిట్లో
అంతరంగ అలజడి ఏమిటో?
నాకు ఈ నిరంతర చింతన ఏమిటో?

No comments:

Post a Comment