నిరీక్షణ


విరహపు జల్లులు కురుస్తున్న ఈ వేళ
నీ జాడ తెలియక నా ఆలోచనలు ఆర్భాటం చేస్తున్నాయి
సెలయేటి మలుపులు నా కంట దారినపడి
కన్న్లుల్లో ప్రేమప్రవాహం నిండిఫోతున్నది
తెలిసిన అడుగులు మళ్ళీవేయలేక
నన్ను నేను మరిచి నీ తీపి గుర్తుల్లో జారి పడుతున్నాను
ఆకాశ దీపంలో నీ రూపం కనిపిస్తున్నా
నా ఊహల చీకట్లో నిన్ను గుర్తు పట్ట లేకున్నాను
గడియవేసిన నీ గుండె తాళం తెరిచి ఈ వేళ
నే తెరిచిన తలుపులు దాటి నా కోసం రాలేవా?
నా శ్వాసవేడి చల్లారకముందే
గాలిలా తాకి నన్ను ఓదార్చిపోలేవా?

3 comments:

  1. మీ ఈ చిత్రాన్ని, నా బ్లాగులో ఉంచాను, తోడు నాకు తోచిన నాలుగు ముక్కలు రాసి.
    అభ్యంతరమైతే తెలుపగలరు. తొలగించగలవాడను.

    http://vookadampudu.wordpress.com

    ReplyDelete