చక్కని చిట్టి చిన్నారి

బుడి బుడి నడకల బుజ్జాయి
బుద్దిగ బడికి వెళ్లోయి
చిల్లర తిరుగుట తగదోయి
అల్లరి చేయుట మానోయి

శారద నిన్నే పిలిచింది
చాలగ చదువగ రావయ్య
భాగ్యము నిన్నే వలచింది
బంగరు భవిత నీదయ్య

కమ్మని కథలే వింటావు
తియ్యని పాటలు పాడెదవు
పొడుపు కథలు విప్పేవు
చిక్కు లెక్కలను చేసేవు

అందరి తో కలిసుండెదవు
అన్ని పాఠములు చదివెదవు
అందలమెక్కి నిలిచెదవు
ఆణిముత్యమై వెలిగెదవు.

1 comment:

  1. బావుంది. చిన్నప్పుడెప్పుడొ, రేడియోలో విని నేర్చుకున్న పాటఒకటి గుర్తుకొస్తోంది.

    "బంగారు పాపాయి బహుమతులు పొందాలి
    మా పాప చదవాలి మా మంచి చదువు"

    భవిష్యత్తుని అద్దంలో చూసినట్టుగా కాక, చివరి రెండు చరణాలూ, ఆశాభావం వ్యక్త పరిచేటట్టుగా వుండి వుంటే, ఇంకా బావుండేదని నాకనిపించింది. నొప్పిస్తే క్షంతవ్యుణ్ణి.

    ReplyDelete