చెలి. వో నా చెలి..

నీ చెలిమి లోని క్రొత్తదనం శూన్యం లో కూడా నన్ను నడిపిస్తుంటే,
అనుక్షణం నా కళ వై నిన్ను శ్రుతింప చేసుకున్నాను.
నిద్రలేని రాత్రిల్లో మూగ పోయిన నా నయనానలను పల్కరింప చేస్తుంటే,
నా చిత్రం లో నీ రూపాన్ని కరిగించుకొని కవ్వించుకొన్నాను.
నా పెదాలకందని చిరునవ్వు నీ స్వోంతం చేసుకుంటే,
నా పలకరింతకు బదులుగా కవితను నైవేద్యం అర్పించ్చుకున్నాను.
నీ మాటల ప్రకృతి ప్రియమైన నా మనస్సుని మాట్లాడిస్తుంటే,
నీ బంగారు మేని చాయపుటంచులు నా కంటి కళలను పలకరిస్తుంటే,
నీ కనుచూపు బాషలు తైలవర్ణపుటంచుల్లో మెరిసిపోతుంటే,
నా మది గోడల్లోంచి పలకరించిన నీ పేరు వినిపించడుం లేదా?...
నా హృదయ విరహవీచికలు నీ మది ఛాయలను కూడా తగులుట లేదా?....

No comments:

Post a Comment