మన పరిచయం

కరిగే కర్పూరం లా చేరిపోయావు నా మదిలోన
చెదరని జ్ఞాపకాల వల వేసావు నా హృదయాన
కన్నుల్తో వెంటాడి కల ల్లో నిలిచి పోయావు
మాటల్తో పోట్లాడి మది సైతం దోచావు
జీవన సంధ్యలో కొయిల రాగమై కూసావు
పావన ధరిత్రి పై నా కొసం వెలిసావు
కదిలే మబ్బుల్లా నువ్వలా విడి పోతుంతే
కురిసే వర్షంలా నా మది కన్నీరు పెడుతున్నది
చెక్కిల్ల పై నీ కన్నీల్లను చూసి
మది లోని ప్రేమ సాగరమై నిండుకున్నది
నా మనసు జాడ నాకే తెలియకున్నది

2 comments:

  1. మది లోని హృదయం అంటే అర్ధమేమిటో?
    anyways! బ్లాగ్ మొదలెట్టేశారు.

    ReplyDelete
  2. మది లోని హృదయం అంటే మనస్సులో మనకు తెలిసో తెలియకనో చోటు చేసుకున్న ప్రేమ/అబిమానం లేదా మనల్ని ప్రమించే వ్యక్తి దూరమైనప్పుడు కలిగే స్పందన/indirect ga ప్రియురాలి మది. thanks lot for your comment, Can i know who r u and what u r?

    ReplyDelete