ఎర్ర మందారం


@ఆత్రేయ
ఒంటరి బ్రతుకుకి విలువేలేదని
జంటలు కట్టి చేతులు కలిపి
ఒకటై చూపి పూవుగ అమరిన
రెక్కలు చూపిన బాటను సాగు

సఖ్యతలోనే అందం ఉందని
సభ్యత కలిపిన విజయం నీదని
మందారం అది చక్కని గురువుగ
నేర్పిన బాటన ముందుకు సాగు


పూరెకుల కలగొలుపు
పువ్వుకే అందాన్ని తెచ్చిపెట్టె
మతోన్మాదుల మారణ కాండ
దేశానికే చిచ్చుపెట్టె

ఎర్ర మందారం
ఎదకు ఎంతో ఆహ్లాదం
ఉగ్రవాదుల ఉన్మాదం
ఈ దేశానికెంతో విశాదం

పేదగుండెల బ్రతుకు మంటల ఈ అగ్ని శిఖలాలనార్పలేమా?
అడుగడుగునా కూలిపోయే నెత్తుటి చితిమంటలనార్పలేమా?
ఆధునిక మానవుని ఆటవిక అరాచకాన్ని మాన్పంచలేమా?
కలవరింతల జీవితాల్లో ఆనందమందారాలు పూయించలేమా?

(పూరెకుల ఐక్యమత్యం, సర్దుబాటు, చక్కటి క్రమశిక్షణనేర్పే వాటి అమరిక లేదా విన్యాసం వల్ల పరిమళాలు వెదజల్లే పుష్పాల్ని మనంచూస్తున్నాముకదా మరి అలాగే శాంతియుత దేశాన్ని ఐక్యమత్యంతో మనం ఎందుకు పొందలేము? పొందవచ్చని భావన అంతే..:D)

7 comments:

 1. మందారం చెప్తున్న మాట: చిన్నపుడు మా నానమ్మ ఆ ఐదు రేకులూ పాండవులు, పైనున్న పుప్పొడి కౌరవులు - రేకులన్నదమ్ముల ఐకమత్యం చూపెడితే కాడలాసాగి చిలవలు పలవలుగా విడిపోయిన పుప్పొడి కుటుంబాలలో విచ్చుకి ప్రతీక అని చెప్పిన మాట గురుతుకొచ్చింది. అది నేటికీ ఈ సమాజవేర్పాటువాదానికి ఉదాహరణమాదిరే తోస్తోంది.

  గాయం సినిమాలో సిరివెన్నెల గారి గేయం :- "నిగ్గదీసి అడుగు ఈ సిగ్గు లేని జనాన్ని..." అంటూ సాగి "బలవంతుడె గెలవాలని నీతి మారకుండా శతాబాలు జరపలేద ఈ అరణ్యకాండా?" అని ప్రశ్నించలేదా?

  ReplyDelete
 2. ఒంటరి బ్రతుకుకి విలువేలేదని
  జంటలు కట్టి చేతులు కలిపి
  ఒకటై చూపి పూవుగ అమరిన
  రెక్కలు చూపిన బాటను సాగు

  సఖ్యతలోనే అందం ఉందని
  సభ్యత కలిపిన విజయం నీదని
  మందారం అది చక్కని గురువుగ
  నేర్పిన బాటన ముందుకు సాగు

  ReplyDelete
 3. బలవంతుడ నాకేమని విర్రవీగిన సర్పం చలిచీమల చేత చిక్కి చచ్చినది నిజం కదా! మనలో ఐకమత్యం లేనంత వరకే విచ్చుకత్తుల రాజ్యం. మనం చేతుల కలిపిన రోజున మనదే సురాజ్యం మరి మనమే ఈ ఎర్రమందారం. కాదంటరా? మరి ఔనంటారా?

  ReplyDelete
 4. చిన్నప్పుడు గడిపిన చిలిపితనపురోజుల్లో టీచర్ చెప్పిన పుస్తకపు మాటలు మల్లీ మీ మాటల్లో కనిపించింది శృతిగారు. మళ్లి నాకు మా బాటనీ లెక్చరర్ పుష్పవిన్యాసం చెప్పే రోజుల్లో గుర్తుకుతీసుకొస్తే ఇదిగో మళ్ళీ ఇలా బ్లాగుపేపరుపై నా డ్రాయింగ్ రూపం లో ఆనాటి జ్ఝాపకం గుర్తుతెచ్చుకున్నాను..పచ్చదనం ఎర్రదనం నాకు చాలా నచ్చింది.

  ReplyDelete
 5. hello sir super for poetry so very very Thank's

  ReplyDelete
 6. పచ్చదనం ఎర్రదనం నాకు చాలా నచ్చింది.శాంతియుత దేశాన్ని ఐక్యమత్యంతో మనం ఎందుకు పొందలేము? పొందవచ్చని భావన అంతే..?మీ మాటల్లో కనిపించింది,మీ డ్రాయింగ్ రూపం లో ఆనాటి జ్ఝాపకం గుర్తుతెచ్చుకున్నాను.ఈ ఎర్రమందారంను కాదంటరా? మరి ఔనంటారా?

  పయిడేటి రఘు

  ReplyDelete