చదువు మరిచి, స్వార్థపూరిత బుద్ది పెంచి,
కన్నవారి కలలు తుడిచి, కానివారిపై కాలుదువ్వి,
ఇష్టమైన జీవితంను కష్టముల పాలుచేసుకొంటివి.
కడుపునింపని, కడకు చేర్చెటి ఉగ్రవాదము తోడుకోరి,
కలవారి ధనం కొల్లగొట్టి నీతిమాలిన బ్రతుకు బ్రతికి,
వీధి మరిచి, ఊరు మరిచి జనం గుండెలో బగ్గుమంటివి.
కరువుపీడిత ప్రజానికానికి కలతలెన్నో చేరువైనా
కానిపోని మాటపల్కి కనుల ముందే చావుచూస్తివి.
కడవరకు నీవు పోరాడి జైలు గదులు లెక్కపెడ్తివి.
ప్రగతి బాటను రూపుమార్చిడి ‘ఉగ్రవాది’వి నీవైతివి.
కలలు మరిచి, కనులు తెరిచి కన్నీటి చుక్కను నీవు కార్చితివి.
చాలా మంచిగా కూర్చారు. మిమ్ములను ఈ క్షణంలో తిట్టాలనుంది. ఏమనంటే.. నిన్ను కన్న తల్లి కడుపు చల్లంగుండా.. అని.
ReplyDeleteఏది ఏమైనా, మీ రచనా శైలిని మెచ్చుకోలేక పోతున్నాను. మన సదురు అన్నలు ఈ విషయాన్ని ఎప్పుడు గ్రహిస్తారో... అలివికాని కొరివిగా వారు మారిన వైనం చూస్తూంటే, ఎమీ చెయ్యలేని నా చేతగాని తనానికి నాకే అసహ్యమేస్తోంది. మిమ్మలను హర్షించడం తప్ప మరేమీ చెయ్యలేని,
భవదీయుడు,
చక్రవర్తి
మీ అందరి కామెంట్స్ ఖచ్చితంగా కొరతలేని కాన్ఫిడెన్స్ ను ఇస్తున్నది అంటే నమ్మండి. ఐ మీన్ అది లేదని కాదు కానీ కోరేవారి కోసం కోంతైనా కానిచ్చేద్దామని చిన్న ఆరాటం. ఇప్పుడు బాగా అనిపిస్తున్నది. మీకు దన్యవాదములు. బాగారావాలని ట్రై చేసాను కాని book లో pen తో బాగాకుదిరింది. expressions and scenery అదిరింది. అదే పై drawing కు impression. అంతే బ్లాగు లో పెట్టా..
ReplyDeleteమీ కవిత చాలా బాగుంది. రంగస్వామి. తాడిపత్రి.
ReplyDelete