నవ వసంతము కురిసింది.. నా ఆశల్లో


కందిరీగ కుట్టింది కరిగిన పరువము లో,
తొలివలపు పిలిచింది వయసు మందిరము లో,

చిలుకమ్మ పలికింది చిన్నారి వయసు లో,
తొలిప్రేమ నవ్వింది తుంటరి మనసు లో,
కోయిలమ్మ కూసింది చింతాకు చిగురు లో,
వెన్నెలన్నీ కాసాయి విరబూసిన ప్రేమ లో,

సిరిమల్లెలు పూచాయి వింతైన రీతి లో,
చిన్నలాడి వలచింది పసందైన ప్రీతి లో,
ఆమె చిరునవ్వు ను చూడగానే
నవ వసంతము కురిసింది చక్కని నా ఆశల్లో.

No comments:

Post a Comment